పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం అయింది. తీవ్రరక్త స్రావం కావడంతో టీఎంసీ కార్యకర్తలు కోల్ కతాలోని ఎస్ ఎస్ కేఎం ఆస్పత్రికి తరలించారు. నుదుటిపై గాయం కారణంగా తీవ్ర రక్త స్రావం అయినట్టు తెలుస్తోంది. సీఎం మమత తలకు గాయాలతో ఉన్న ఫొటోలను విడుదల చేశారు టీఎంసీ నేతలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదంలో గాయపడినట్టు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ ) మైక్రోబ్లాగింగ్ సైట్ X లో తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.