దేశం షాక్ : రూ.4 వేల 716 కోట్ల GST స్కాం

దేశం షాక్ : రూ.4 వేల 716 కోట్ల GST స్కాం

పశ్చిమ బెంగాల్ డైరెక్టరేట్ ఆఫ్ కమర్షియల్ టాక్సెస్ (స్టేట్ జీఎస్‌టి) నకిలీ జిఎస్‌టి ఇన్‌వాయిస్  లు  సృష్టించిన   ముఠాలను అరెస్ట్ చేసింది. ఈ రెండు రాకెట్‌ ముఠాలలో  మొత్తం టర్నోవర్ రూ. 4,716 కోట్లని .. పన్ను  ఎగవేత రూ. 801 కోట్లని డైరెక్టరేట్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ కమిషనర్ ఖలీద్ అన్వర్  తెలిపారు.  నలుగురు కీలక ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. మిగిలిన ముగ్గురికి బెయిల్ మంజూరయ్యిందని చెప్పారు.  అరెస్ట్‌ల కోసం పోలీసుల నుంచి సహాయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  

ప్రభుత్వ పన్ను రాబడిలో రూ. 801 కోట్లను ఎగవేసేందుకు నలుగురు ఆపరేటర్లు పశ్చిమ బెంగాల్‌లో 178 నకిలీ ఆందోళనల నెట్‌వర్క్‌ను సృష్టించి.. మోసపూరిత ఇన్‌వాయిస్‌లను జారీ చేశారని అదనపు కమిషనర్ సుదేష్ణ ముఖోపాధ్యాయ తెలిపారు.   దక్షిణ బెంగాల్‌లోని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన దాదాపు 25 మంది అధికారుల బృందం సహకారంతో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు సోమశ్రీ కర్ , మధుమిత కుందు ఈ నకిలీ జీఎస్టీ రాకెట్ ముఠాలను చేధించారని తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతోందని ముఖోపాధ్యాయ అన్నారు. 

నిందితుడు ఎలా ఆపరేషన్ చేశాడంటే..

 ముందుగా ఆపరేటర్లు  అనుమానస్పద వ్యక్తులను చిన్న నగదు లేదా ఉపాధి హామీలతో ఆకర్షిస్తారు. వారి పాన్, ఆధార్, ఇతర గుర్తింపు డాక్యుమెంట్స్ ను మోసపూరితంగా తీసుకున్నారు.  వాటిని ఉపయోగించి చాలా ఫేక్ సంస్థలను చేర్చుకుని.. జీఎస్టీ రిజిస్ట్రేషన్లను పొందారు.  ఆపరేటర్లు లీజ్ కాంట్రాక్ట్.. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్ను ధృవీకరణ పత్రాలు, స్థలాల యజమానులు, నోటరీల సంతకాలు కూడా ఫేక్ వి సృష్టించారు. ఇలా  పశ్చిమబెంగాల్  డైరెక్టరేట్ చరిత్రలో 1941 తర్వాత నేరుగా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధ్వర్యంలో అరెస్టులు జరగడం ఇదే తొలిసారి.