సౌరవ్​ గంగూలీకి జెడ్​ కేటగిరీ భద్రత

సౌరవ్​ గంగూలీకి జెడ్​ కేటగిరీ భద్రత

భారత్​ క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీకి భద్రతను పెంచే విషయంలో పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉండగా, అదనంగా జెడ్​ కేటగిరీ భద్రతకూడా  కల్పించనున్నారు.

 పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం సీఎం మమత బెనర్జీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నిర్ణయం అమల్లోకి రాగానే కోల్​కతాలోని బెహాలా ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద 24 గంటల పాటు ఇద్దరు ప్రత్యేక భద్రతాధికారులు కాపలాగా ఉండనున్నారు.  భద్రతా సిబ్బంది సంఖ్య సైతం పెంచున్నారు.