బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మరో ముగ్గురు మృతి

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మరో ముగ్గురు మృతి

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అల్లర్లు, హింస కొనసాగుతున్నాయి. శనివారం ఒక్క రోజే పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 మంది చనిపోగా, ఆదివారం మరో ముగ్గు  రు మృతి చెందారు. దీంతో రెండు రోజుల్లో ఎన్నికల హింసలో మృతి చెందిన వారి సంఖ్య 15కు పెరిగిం ది. ఇక హింస, అల్లర్లు జరిగిన 600 కు పైగా పంచాయతీల్లో సోమవారం రీపోలింగ్ నిర్వహి స్తామని రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఆదివారం ప్రకటిం చారు.

ముర్షి దాబాద్, మాల్దా, నదియా, నార్త్, సౌత్ 24 పరగణాల జిల్లాలు, ఇతర పలు జిల్లా ల్లో పోలింగ్ బూత్ ల స్వాధీనం, బ్యాలెట్ బాక్స్ ల ధ్వం సం, ఎన్నికల సిబ్బందిపై దాడుల వంటివి జరిగాయని, ఇలాంటి అన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని సిన్హా పేర్కొన్నారు. అయితే పంచా యతీ ఎన్నికల పోలింగ్​ నాటి ఘర్ష ణల్లో 18మంది మరణించారని పలు పార్టీలు ప్రకటించాయి.  టీఎంసీ తమ పార్టీకి చెందినవారు 9మంది చనిపోయారని ప్రకటించింది. కాంగ్రెస్​పార్టీ తమ మద్దతుదారులు ముగ్గురు చనిపోయారని, బీజేపీ, సీపీఎం ఇద్దరేసి చొప్పున తమ మద్దతుదారులు చనిపోయారని ప్రకటించగా మరో ఇద్దరి మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.