సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు..మనస్థాపంతో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్ధిని

సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు..మనస్థాపంతో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్ధిని

కోల్ కత్తాలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది . ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్ధిని మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల్ని చూసిన బాధితురాలి విద్యార్ధులు అమెకు సమాచారం అందించారు. ఇదే విషయం పై విద్యార్ధిని బంధువులు, స్నేహితులు ఆరాతీయడంతో తీవ్ర మన స్థాపానికి గురైంది.తన ఫోటోల్ని మార్ఫింగ్ చేయడాన్ని తట్టుకోలేని బాధితురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి ఆత్మహత్యపై కుటుంబసభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.