ఉద్యోగం పేరుతో యువతికి నరకం : అశ్లీల వీడియోల్లో నటించాలంటూ చిత్రహింసలు

ఉద్యోగం పేరుతో యువతికి నరకం : అశ్లీల వీడియోల్లో నటించాలంటూ చిత్రహింసలు

మనుషులను మించిన క్రూర జంతువులు ఈ ప్రపంచంలో ఉండవు అనటానికి ఈ ఒక్క ఇన్సిడెంటే ఉదాహరణగా చెప్పవచ్చేమో. కనీసం మానవత్వం లేకుండా.. మనుషులం అనే సంగతే మరిచి ఒక మహిళను అత్యంత దారుణంగా.. కిరాతకంగా టార్చర్ చేశారు దుర్మార్గులు. జాబ్ ఇప్పిస్తామని చెప్పి.. బార్ డ్యాన్సర్ గా చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పోర్న్ వీడియోల్లో నటించాలని ఒత్తిడి చేశారు. ఒప్పుకోలేదని చెప్పడానికి మాటలు రానంతా దారుణంగా టార్చర్ చేసిన ఘటన వెస్ట్ బెంగాల్ లో చోటు చేసుకుంది. 

వెస్ట్ బెంగాల్ లోని ఉత్తర 24 పరగనాల జిల్లాలో ఒక మహిళలను ఆరు నెలలుగా బంధించి టార్చర్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐరన్ రాడ్స్ తో కొట్టి.. ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేయటంతో కదలలేని స్థితిలో ఉంది. దుర్మార్గుల క్రూర రాక్షస క్రీడకు బలైన యువతి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 

24 పరగణాలలోని పనిహాతి గ్రామానికి చెందిన యువతి.. హౌరా జిల్లాకు చెందిన అరియన్ ఖాన్ మాటలకు, ప్రామిస్ కు నమ్మి మోసపోయింది. ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో పనిచేసే యువతి.. మంచి జాబ్, ఫ్లాట్ ఆఫర్ చూపేసరికి నమ్మింది. అరియన్ ఖాన్ ఫ్లాట్ ను తీసుకుని అందులోనే నివాసం ఉండేందుకు దొంజుర్ వెళ్లింది. కానీ అది ట్రాప్ అనే విషయాన్ని ఆమె మొదట గ్రహించలేకపోయింది. 

అరియన్ ఖాన్ తో పాటు అతని తల్లి శ్వేత కూడా ఈ క్రూర క్రీడలో పాలుపంచుకున్నారని తెలిసి అధికారులు షాకింగ్ కు గురయ్యారు. ఒక తల్లిగా, మహిళగా బాధ్యతలు మోస్తున్న ఆమె..  బిడ్డలాంటి సాటి యువతిని ఇంతలా టార్చర్ చేయడం ఆందోళన కలిగించే అంశం.

పళ్లు ఊడగొట్టి, చేతులు విరగొట్టి, రాడ్డుతో...

బార్ డ్యాన్సర్ గా చేయాలని మొదట ఒత్తిడి తెచ్చారు తల్లీ కొడుకు. ఆ తర్వాత పోర్న్ వీడియోలో నటించాలని బలవంత పెట్టారు. ఆమె ఒప్పుకోక పోవడంతో టార్చర్ మొదలెట్టారు. పళ్లు, చేతులు విరగ్గొట్టి, రాడ్డుతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ప్రైవేట్ పార్ట్స్ పై కూడా దాడి చేసినట్లు విచారణ అధికారులు తెలిపారు. కనీసం సరిగ్గా నిలబడలేని స్థితిలో ఆ యువతి ఇప్పుడు ఉన్నట్లు చెబుతున్నారు.

పరారీలో నిందితులు:

యువతిని అత్యంత కిరాతకంగా టార్చర్ చేసిన తల్లీ, కొడుకు పరారీలు ఉన్నారు. అరియన్ ఖాన్, శ్వేతా ఖాన్ అనే ఇద్దరు ‘ఇసారా ఎంటర్టైన్మెంట్’ అనే ప్రొడక్షన్ హౌజ్ నడిపిస్తూ ఉంటారు. 2021లో యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. కేవలం నాలుగు మ్యూజిక్ వీడియోలు మాత్రమే చేశారు. అయితే బయటికి యూట్యూబ్ వీడియోలు చేసినా.. లోలోపల పోర్న్ కోసమే ప్రొడక్షన్ హౌజ్ నడిపిస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

వీళ్ల టార్చర్ నుంచి.. ఆ ఫ్లాట్ నుంచి జూన్ 7న సదరు యువతి ఎస్కేమ్ అయ్యింది. తల్లిదండ్రులు కరాధా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇద్దరు నిందితులు పరారీరోలు ఉన్నట్లు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. నిందితురాలు శ్వేతా ఖాన్ అలియా ఫుల్తుష్ భేగం.. ఈ ట్రాప్ కు మాస్టర్ మైండ్ అని పోలీసులు తెలిపారు. గతంలో బార్ డ్యాన్సర్ గా పనిచేసేది. తనకున్న ఇన్ ఫ్లుయెన్స్ తో ఆమెపై ఎవరూ కంప్లైంట్ ఇవ్వాలన్నా భయపడేవారని స్థానికులు తెలిపారు.