కోళ్ల పందెంరాయుళ్లపై లక్షన్నర కేసులు

కోళ్ల పందెంరాయుళ్లపై లక్షన్నర కేసులు

సంక్రాంతి అనగానే సినిమా ప్రేక్షకులకు భారీ సినిమా రిలీజ్ లు గుర్తుకు వస్తాయి.. ఏపీ జనాలకు మాత్రం కోడి పందాలు గుర్తుకు వస్తాయి. విదేశాల నుండి కూడా సంక్రాంతికి వచ్చి కోడి పందాలు ఆడేవారు వేల సంఖ్యల్లో ఉంటారనడంలో సందేహం లేదు. పోలీసుల హెచ్చరికలను  పందెంరాయుళ్ళు లెక్కచేయడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో కొనితివాడ, నవుడూరు గ్రామాల్లో నాలుగు కోడిపందాల బరులను  పోలీసులు ధ్వంసం చేశారు. 

వీరవాసరం మండలంలో సుమారు 250 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామని..ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని సిఐ నాగ ప్రసాద్ తెలిపారు..బరులు నిర్వహించడానికి స్థలం కేటాయించిన వ్యక్తులపై 1,50,000 బైండోవర్ కేసులు నమోదు చేసినట్టుగా అన్నారు  కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.