27 ఏళ్ల తర్వాత..ఆస్ట్రేలియాను ఓడించిన విండీస్‌‌

27 ఏళ్ల తర్వాత..ఆస్ట్రేలియాను ఓడించిన విండీస్‌‌

బ్రిస్బేన్‌‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌‌లో వెస్టిండీస్‌‌ సంచలన విజయాన్ని నమోదు చేసింది. యంగ్‌‌ పేసర్‌‌ షామర్‌‌ జోసెఫ్‌‌ (7/68) చెలరేగడంతో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌‌లో విండీస్‌‌ 8 రన్స్‌‌ తేడాతో కంగారూలను ఓడించింది. దీంతో  రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను ఇరుజట్లు 1–1తో డ్రా చేసుకున్నాయి. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత ఆసీస్‌‌ గడ్డపై తొలి టెస్ట్‌‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చివరిసారి1997లో వాకాలో వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో ఆసీస్​పై నెగ్గింది.

216 రన్స్‌‌ ఛేదనలో 60/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 50.5 ఓవర్లలో 207 రన్స్‌‌కే ఆలౌటైంది. స్మిత్‌‌ (91 నాటౌట్‌‌), గ్రీన్‌‌ (42) పోరాడారు. తొలి సెషన్‌‌లో వరుసగా10 ఓవర్లు వేసిన జోసెఫ్‌‌ ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. ఆసీస్‌‌ విజయానికి ఇంకా 29 రన్స్‌‌ అవసరమైన దశలో స్టార్క్‌‌ (21) ఔట్​కావడంతో ఆసీస్​ కోలుకోలేకపోయింది. షామర్​కు ప్లేయర్​ ఆఫ్​ దమ్యాచ్​, సిరీస్​ లభించాయి.