నేడు విండీస్‌తో రెండో టీ20

నేడు విండీస్‌తో రెండో టీ20

రా. 7 నుంచి డీడీ స్పోర్ట్స్​లో

పోర్ట్​ ఆఫ్​ స్పెయిన్​ (ట్రినిడాడ్): తొలి వన్డేలో ఆఖరి బాల్​కు గట్టెక్కిన టీమిండియా ఆదివారం రాత్రి వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌తో  జరిగే రెండో వన్డేలో పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి సిరీస్‌‌‌‌ను  కైవసం చేసుకోవాలని చూస్తోంది. అంతకంటే ముఖ్యంగా తొలి పోరులో నిరాశ పరిచిన మిడిలార్డర్​ బ్యాటర్లు పుంజుకోవాలని ఆశిస్తోంది. పలువురు సీనియర్ల గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించిన ధవన్​ కెరీర్​ నిలబెట్టుకునే ఇన్నింగ్స్​తో ఆకట్టుకోగా.. షార్ట్​ ఫార్మాట్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌గా వచ్చిన చాన్స్‌‌‌‌ను  గిల్​ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. 19 నెలల తర్వాత తొలి వన్డే ఆడిన అతను  దూకుడైన బ్యాటింగ్​తో అలరించాడు. వన్​డౌన్​లో శ్రేయస్​ అయ్యర్​ కూడా ఫామ్​చూపెట్టాడు. కాబట్టి ఈ మ్యాచ్​లోనూ ఈ ముగ్గురు కొనసాగడం ఖాయమే. అయితే, టాప్-–​3 బ్యాటర్లంతా హాఫ్​ సెంచరీలు కొట్టడంతో 350 స్కోరు చేసేలా కనిపించిన ఇండియా  మిడిలార్డర్​ కుప్పకూలడంతో దాదాపు 50 రన్స్​ తక్కువ చేసింది. అందుకే విజయం కోసం చివరి బాల్​ వరకూ పోరాడాల్సి వచ్చింది.

ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్ తొలి వన్డేలో  నిరాశ పరిచాడు. జట్టులో ప్రతీ చోటుకు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో  బ్యాట్ ఝుళిపించకపోతే ఇతరులకు తను దారి వదలాల్సి ఉంటుంది. రెండో మ్యాచ్​లో సంజూతో పాటు సూర్యకుమార్​, దీపక్​ హుడా, అక్షర్​ పటేల్​పై కూడా ఫోకస్​ ఉంది. జడేజా గైర్హాజరీలో హుడాను ధవన్​ పార్ట్​టైమ్ స్పిన్నర్​ గా ఉపయోగించుకున్నాడు. చహల్​ కంటే ముందే బౌలింగ్​కు వచ్చిన హుడా వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్​ చేసి ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్​లో సిరాజ్, శార్దూల్​, చహల్​ సత్తా చాటినప్పటికీ.. విండీస్​ 300 స్కోరు చేసిందంటే మన బౌలింగ్​లో లోపాలు ఉన్నట్టే. వాటిని సరిదిద్దుకొవాల్సి ఉంటుంది. ఇక, వరుసగా ఏడో వన్డేల్లో ఓడిన విండీస్​ ఈ మ్యాచ్​తో అయినా గెలుపు బాట పట్టాలని కోరుకుంటోంది. గత మ్యాచ్​లో  ఇండియాకు గట్టి పోటీ ఇవ్వడం ఆతిథ్య జట్టులో ఆత్మవిశ్వాసం పెంచే విషయమే. నాణ్యమైన బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కొని 300 స్కోరు చేసిన కరీబియన్లను ఇండియన్స్​తక్కువగా అంచనా వేయడానికి లేదు.