హైదరాబాద్ లో నకిలీ గన్ లైసెన్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో నకిలీ గన్ లైసెన్స్ ముఠా అరెస్ట్

నకిలీ గన్ లైసెన్స్ లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్ లైసెన్సులు ఇష్యూ చేసే ఉన్నతాధికారుల సంతకాలు, స్టాంపులతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ గన్ లైసెన్సులు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆరుగురు ముఠా సభ్యులను పట్టుకున్నారు.

ఈ ముఠా నుంచి 33 గన్స్, ఒక రివాల్వర్, 140 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీల్లో పని చేసే వారికి ఇలాంటి గన్ లైసెన్స్ లను అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జమ్మూకశ్మీర్ రాజౌరి జిల్లాకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. వీరితో పాటు మిగితా ఐదుగురు సిటీకి చెందిన ;ai  సెక్యూరిటీ ఏజెన్సీల ఓనర్లుగా గుర్తించారు. వీరి నుంచి 34 ఫేక్ వెపన్ లైసెన్స్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.