
కరోనా వైరస్ వలన మానవ జీవనం స్తంభించిపోయింది. అన్ని దేశాలు దాదాపుగా లాక్ డౌన్ అయ్యాయి. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి జీవనం సాగిస్తున్నారు. రవానా మొత్తం స్తంబించిపోయింది. ఈ పరిస్థితులలో జంతువులు రోడ్ల పైకి వచ్చి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను షేర్ చేస్తూ మనుషులు లేని ఈ జంతుజాలం చాలా స్వేచ్చగా విహరిస్తున్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ముంబై సముద్రతీరానికి దగ్గరలో ఉన్న ‘బాంబే హై’ ప్రాంతంలో తిమింగలాలు స్వేచ్చగా తిరుగుతున్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతుంది. ఈ వీడియోను ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ( ONGC ) ఉద్యోగులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పలువురు కామెంట్ చేశారు.
‘బొంబాయి హై’ అనేది ముంబై సముద్ర తీరానికి 176కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశానికి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC). ఇది ఒక ఆయిల్ ఫీల్డ్. చమురును సముద్రంనుంచి బయటకు తీస్తుంది. అయితే ONGC ఉద్యోగులు తిమింగలాలు ఆయిల్ ఫీల్డ్ దగ్గర తిరుగుతున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారని సమాచారం. అయితే మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ONGC అధికారులను సంప్రదించగా అది తమ ఉద్యోగులు తీసిన వీడియో కాదని, అసలు మొబైల్ ఫోన్ ను సముద్రంలోపలికి అనుమతించమని తెలిపారు. చివరగా అది భారత దేశానికి చెందిన వీడియో కాదని తేలింది.