Health Tips: వజ్రాసనం వేయడం చాలా ఈజీ... దాని ప్రయోజనాలు ఇవే...

Health Tips: వజ్రాసనం వేయడం చాలా ఈజీ... దాని ప్రయోజనాలు ఇవే...

కండరాలు పట్టేసినప్పుడు కాసేపు వజ్రాసనంలో ఉంటే రిలీఫ్ గా అనిపిస్తుంది.  జీవక్రియలు వేగంగా జరగడానికి కూడా ఈ ఆసనం పనికొస్తుంది.  అయితే వజ్రాసనంలో ఐదు నిమిషాలు ఉండటం కూడా కొందరికి కష్టమవుతుంది.  అలా అనిపించడానికి కారణాలతో పాటు సొల్యూషన్ కూడా చెబుతున్నారు యోగా ఎక్స్ పర్ట్స్.  వజ్రాసనంలో ఓ రెండు నిమిషాలు ఉన్నారో లేదో కొందరికి కాళ్లు తిమ్మిర్లు పడతాయి.  కాలి మడిమ బెణుకుతుంది.  ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు తెలుసుకుందాం. . . .

మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండే.. ఆరోజంతా హ్యాపీగా గడుపుతాం.. అందుకనే రోజూ ఉదయం నిద్ర లేచినప్పుడు ప్రశాంకండరాలు పట్టేసినప్పుడు కాసేపు వజ్రాసనంలో ఉంటే రిలీఫ్ గా అనిపిస్తుంది.  జీవక్రియలు వేగంగా జరగడానికి కూడా ఈ ఆసనం పనికొస్తుంది.  అయితే వజ్రాసనంలో ఐదు నిమిషాలు ఉండటం కూడా కొందరికి కష్టమవుతుంది.  అలా అనిపించడానికి కారణాలతో పాటు సొల్యూషన్ కూడా చెబుతున్నారు యోగా ఎక్స్ పర్ట్స్.  వజ్రాసనంలో ఓ రెండు నిమిషాలు ఉన్నారో లేదో కొందరికి కాళ్లు తిమ్మిర్లు పడతాయి.  కాలి మడిమ బెణుకుతుంది.  ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు తెలుసుకుందాం. .తంగా ఉండే మానసిక స్థితి ఆరోజు గడిచే విధానానికి గుర్తు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. అందుకనే రోజు ప్రశాంతమైన.. సానుకూల దృక్పథంతో ప్రారంభించాలని.. అప్పుడే రోజంతా సంతోషంగా గడుపగలమని చెప్పారు.

తినేటప్పుడు, చదువుకొనేటప్పుడు కూడా కుర్చీలు, సోఫాల మీద కూర్చోవడానికి అలవాటు పడిపోయారంతా.  నేలపై రెండు కాళ్లను మడతపెట్టి బాసింపట్టు వేసుకొని కూర్చోవడం బాగా తగ్గిపోయింది. లైఫ్ స్టైల్లో  మార్పులు, కొత్త  అలవాట్ల కారణంగా మోకాళ్లు, కాలి మడమలు బలంగా ఉండవు.  దాంతో వజ్రాసనంలో కూర్చోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. మోకాళ్లు, మొకాలి మడమలకు గాయాలు అయిన వాళ్లు వజ్రాసనంలో ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు. మోకాళ్లు, కాలి పిక్కల దగ్గర కండరాలు ఫ్లెక్సిబుల్ గా లేకపోవడం వల్ల కూడా వజ్రాసనం వేయడం కష్టమవుతుంది.ఒబెసిటి సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ టైం వజ్రాసనంలో ఉండలేరు.  వీళ్లకి శరీర బరువును మోకాళ్ల మీద బ్యాలెన్స్ చేయడం సవాల్ గా మారింది. కండరాలు ఫ్లెక్సిబుల్ గా లేకుంటే రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి.  

ఇలా చేస్తే బెటర్

ఎక్కువసేపు కూర్చొని లేచిన ప్రతిసారి స్త్రైచింగ్ చేయాలి, కాలి కండరాలు గట్టిపడేందుకు వాకింగ్, జాగింగ్, సైకిలు తొక్కడం, మెట్లు ఎక్కడం వంటి ఎక్సర్ సైజులు చేయాలి.  వజ్రాసనంలో 30 సెకన్లు ఉండాలి.  రోజులో నాలుగైదు సార్లు ఇలా చేయాలి.  తర్వాత కంఫర్ట్ ను బట్టి టైం పెంచుతూ పోవాలి.నేలపై వజ్రాసనం వేయడం కష్టంగా ఉంటే మోకాళ్ల కింద దిండు పెట్టుకోవాలి.  బాలాసనం, పాదంగస్తాసం, సేతు బంధాసనం, కపోతాసనం, ఆంజనేయ ఆసనం  వంటి 15-20 సెకన్లు  ప్రాక్టీస్ చేస్తే  వజ్రాసనం వేయడం ఈజీ అవుతుంది.

వజ్రాసనం వేస్తే....

స్ట్రెస్ తగ్గిపోతుంది.  జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  అసిడెటీతో పాటు పీరియడ్ క్రాంప్స్ తగ్గిపోతాయి. బరువు తగ్గుతారు.  కండరాలు పట్టేయవు.  మూత్రనాళ సంబంధ సమస్యలకి మందులా పని చేస్తుంది.  వెన్నునొప్పి మాయమవుతుంది.

వజ్రాసనం వేయు విధానము 

మెద‌ట‌గా మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌వేలిపై కుడికాలి బ్రోట‌న వేలు వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. రెండు పాదాల లోప‌లి భాగం అర్ధచంద్రాకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. రెండు చేతులు పైకి ఎత్తి ఎడ‌మ అది చేతిపై, కుడి అరిచేతిని పెట్టి కుడి అర‌చేతిపై ఎడ‌మ అరిచేతిని వుంచి తొడ‌లు క‌లిపి వుంచాలి. మెడ, వీపు, త‌ల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచ‌కుండా దృష్ఠిని మ‌ర‌ల్చకుండా నిశ్చలంగా వుండాలి. మ‌న‌స్సు పూర్తిగా శ‌రీరం పైనే ల‌గ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వ‌దులుతూ వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఈ ఆస‌నంలో కుర్చొవ‌డం వ‌ల్ల ఎక్కువ మేలు జ‌రుగుతంది. ఆస‌న‌ము నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకున్నపుడు మోకాళ్ల పై నుంచి చేతుల‌కు విరామం క‌లిగించాలి. త‌రువాత ఒక్క కాలిని ఒక్కసారి ఇంకో కాలిని ఒక్కసారి ముందుకు సాంచి ఆసనం నుంచి బ‌య‌ట‌కు రావాలి.