చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందంటే..

చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందంటే..

ఉదయం టీ మొదలు డిన్నర్ తర్వాత డెజర్ట్ వరకు ప్రతిదానిలో చాలా మంది చక్కెరను ఉపయోగిస్తారు. ఇది సర్వసాధారణమైన పదార్ధం. కొన్ని సార్లు ఇది లేకుండా కొన్ని వంటకాలు చేయడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే, చక్కెర ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, ఇది మధుమేహం, ఊబకాయం, దంత క్షయం వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వస్తాయి. అలాంటి చక్కెరను ఆహారంలో వినియోగించకపోతే ఏమౌవుతుంది. అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాహార నిపుణుడు న్మామి అగర్వాల్ చక్కెరను ఎందుకు వదులుకోవాలో చక్కగా వివరించారు. వరుసగా 14 రోజులు నేరుగా చక్కెర తినకపోవడం చాలా కష్టమైన పనిలా అనిపించవచ్చు. కానీ అది అద్భుతమైన ఫలితాలను ఇవ్వగలదని ఆమె చెప్పుకొచ్చారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభమవుతుందని చెప్పారు. బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కని పరిష్కారమని తెలిపారు. కాబట్టి చక్కెరకు వీడ్కోలు చెప్పడం ఉత్తమమైన మార్గమని ఆమె వెల్లడించారు.

https://www.instagram.com/reel/CsiU7DrLSPR/?utm_source=ig_embed&ig_rid=f5553106-25d1-4969-a5e0-0fbca4fc4a86