V6 News

Health tips:చలికాలంలో నల్ల మిరియాల టీతో..ఆరోగ్యానికి ఎంతో మేలు

Health tips:చలికాలంలో నల్ల మిరియాల టీతో..ఆరోగ్యానికి ఎంతో మేలు

చలికాలంలో వచ్చిందంటే చాలు..వేడివేడిగా టీ తాగాలనిపించడం.. గతంకంటే రెండు కప్పులు ఎక్కువగా లాగించాలనిపించడం సహజం. ఎందుకంటే చాయ్ తాగితే శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా అందిస్తుంది..టీలలో చాలా రకాలు ఉన్నాయి. చలికాలంలో అల్లం టీ, మిరియాలటీ ఎక్కువగా తాగుతుంటాం..అయితే టీలో  మిరియాల పొడి కలుపుకొని తాగినా లేదా మిరియాలటీ తాగినా ఆరోగ్యానికి ఆరోగ్యం..రుచికి రుచి లభిస్తుంది. 

చలికాలంలో టీలో నల్ల మిరియాలను కలుపుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైపెరిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది, వాపును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి నష్టాన్ని నివారించడంతో సహాయపడుతుంది. నల్ల మిరియాల టీ.. చలికాలంలో వెచ్చదనం , రక్షణ  రెండింటిని అందిస్తుంది. 

నల్ల మిరియాలను నల్లబంగారం అని కూడా పిలుస్తారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. చల్లని వాతావరణంలో ముఖ్యంగా చలి కాలంలో దగ్గు, జలుబును ఇట్టే తగ్గిస్తాయి. కాబట్టి నల్ల మిరియాలను టీ పొడిని టీలో జోడించడం వల్లకలిగే అంతా ఇంతా కాదు. 

నల్ల  మిరియాలలో  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతో సాయపడతాయి. మనం ఆహారం తీసుకున్నప్పుడు, కాలుష్యం, సిగరేట్  తాగడం వల్ల అధికంగా ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి.  ఇవి వింటర్ లాంటి చలి సీజన్ లో శరీరంలో వినాశనాన్ని సృష్టిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.  టీలో నల్లమిరియాల పొడి కలుపుకొని తాగడం వల్ల ఉత్పన్నమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ తో ఆరోగ్యంగా ఉంచుతాయి. 

నల్ల మిరియాలలో ఉండే పైపరిన్ అనే మిశ్రమం..  ఇది కీళ్ల వాపులు, ఉబ్బసం, శ్వాస కోశ ఇబ్బందులను కలిగించే వాయు మార్గాలను అడ్డంకులను తొలగిస్తాయి. 

రక్తంలోని చక్కెర స్థాయిలను పైపరిన్ నియంత్రిస్తుంది. జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. 

సాధారణంగా చలికాలంలో రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది.. ఇది గుండెజబ్బులకు ప్రధాన కారణం. నల్ల మిరియాల రసం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.

నల్లమిరియాలు టీ తయారీ.. 

పదార్థాలు

  • నీళ్లు-2 కప్పులు
    తాజాగా గ్రౌండ్ చేసిన నల్ల మిరియాలు -అర టీస్పూన్
    తేనె -1 టీస్పూన్ ఇది మీయిష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. 
    నిమ్మరసం---1 టీస్పూన్ 

ఎలా తయారు చేయాలి..?

మొదట నీటిని బాగా మరిగించాలి.  మరిగే నీటిలో నల్లమిరియాల పొడి అర టీ స్పూన్, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి స్టౌ ఆఫ్ చేయాలి. మూడు నిమిషాల వరకు అలాగే ఉంచాలి. వడకట్టి వేడిగా ఉన్నపుడే తాగితే  ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. 
స్ట్రాంగ్ బ్లాక్ పెప్పర్ టీ కావాలంటే తేనె తప్ప మిగతా పదార్థాలన్నింటినీ జోడించి కొన్ని నిమిషాలు మరిగించి తర్వాత మంట తీసెయ్యాలి. వడకట్టిన తర్వాత తేనె జోడించి తాగొచ్చు.