హార్ట్ ఎటాక్ వస్తే..సీపీఆర్ చేసి కాపాడవచ్చు

హార్ట్ ఎటాక్ వస్తే..సీపీఆర్ చేసి కాపాడవచ్చు

దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రజలు హార్ట్ ఎటాక్కు గురై ప్రాణాలు విడుస్తున్నారు.  డ్యాన్స్ వేస్తూ కొందరు.. వ్యాయామం చేస్తూ మరికొందరు..ఊరికే కూర్చుని ఇంకొందరు కుప్పకూలుతున్నారు.అప్పటి వరకు మామూలుగా ఉండే మనిషికి ఒక్కసారిగా గుండెపోటు రావడం, వెంటనే కుప్పకూలడం, ఆ తర్వాత మరణించడం..ప్రస్తుతం సెకన్లలోనే జరిగిపోతున్నాయి.

గుండెపోటు అంటే ఏమిటి..?

గుండెపోటును మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు, గుండె కండరాలలో కొంత భాగం తగినంత రక్తాన్ని పొందనప్పుడు హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి చికిత్స లేకుండా గుండె కండరాలు ఎక్కువ కాలం  కొనసాగుతాయి.  అది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) అనేది గుండెపోటుకు సాధారణ కారణం.  గుండె కండరాలకు రక్త సరఫరాను నిలిపివేసే కరోనరీ ఆర్టరీ యొక్క బలమైన  ఒత్తిడి  గుండెపోటుకు కారణం అవుతుంది. 

కార్డియాక్ అరెస్ట్..హార్ట్ ఎటాక్ రెండూ ఒక్కటేనా..?

హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్  రెండూ గుండెకు సంబంధించిన వ్యాధులే. అయితే వీటికి తేడా ఉంది.  రెండింటికి భిన్నమైన కారణాలున్నాయి.  గుండెపోటు వచ్చినప్పుడు రోగిని కాపాడటం కొంచెం సాధ్యమవుతుంది. కానీ కార్డియాక్‌ అరెస్ట్‌ వస్తే మాత్రం మనిషి కాపాడటం చాలా కష్టమవుతుంది. 
అయితే హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్ మధ్య ఉన్న తేడా ఏంటంటే... కొవ్వు కారణంగా గుండెలోని  ధమనులలో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తుంది. అలాగే గుండె వ్యవస్థలో లోపం కారణంగా కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. దీని వల్ల గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది.  గుండెపోటు విషయంలో వ్యాధి లక్షణాలు వ్యక్తి శరీరంలో ఒకటి నుంచి రెండు రోజుల ముందు లేదా కొన్ని గంటల ముందు కనిపిస్తాయి. వీటిని గమనించి సకాలంలో చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. 

కానీ కార్డియాక్ అరెస్ట్‌..హార్ట్ ఎటాక్ కు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్‌ వస్తే  తీవ్రమైన  చెస్ట్ పెయిన్, స్పృహ తప్పడం,  పల్స్ పడిపోవడం,  బ్రెయిన్‌ పనిచేయకపోవడం వంటి లక్షణాలు వెంటనే జరుగుతాయి. కార్డియాక్ అరెస్ట్  వచ్చిన సమయంలో  వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతాడు. శరీరంలోని ఇతర భాగాలతో పాటు  మెదడు, ఊపిరితిత్తులకు రక్త సరఫరా ఆగిపోతుంది.  పల్స్ క్రమంగా పడిపోతుంది. చివరకు మనిషి చనిపోతాడు. ఈ పరిస్థితుల్లో వెంటనే అతనికి CPR ఇవ్వాలి. 

సీపీఆర్ అంటే ఏమిటీ...అది ఇస్తే బతుకుతారా..?

CPR అంటే కార్డియోపల్మనరీ రీససిటేషన్.  గుండె పనితీరు సడెన్ గా ఆగిపోయేటప్పుడు..వారికి వెంటనే పంప్ చేసేందుకు ఉపయోగపడే విధానం. గుండెకు పంపింగ్ చేస్తూ..ఆ సమయంలో ఊపిరితిత్తులు  తాజా ఆక్సిజన్ తీసుకునేలా చేయాలి. ఇందుకోసం పేషంట్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాల్సి ఉంటుంది.

కార్డియాక్ అరెస్ట్ కు గురైన వారికి  సీపీఆర్ అవసరం ఉండదు. అయితే ఎవరికి సీపీఆర్ అవసరమో తెలుసుండాలి. 
1. కొందరికి  గుండె కొట్టుకోవడం చాలా తగ్గిపోతుంది. హార్ట్ బీట్ ఉండదు. రక్తం సరఫరా కూడా ఆగిపోతుంది. ఇలాంటి వారికి ECG తీస్తే స్ట్రెయిన్ లైన్ వస్తుంది. ఇలాంటి వారికి సీపీఆర్ చేసి బతికించొచ్చు.

2. కొందరికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. సాధారణంగా  నిమిషానికి 50 నుంచి 80 సార్లు కొట్టుకోవాల్సి ఉండగా... హార్ట్ ఎటాక్ కు గురైతే...గుండె 200 అంతకంటే ఎక్కువ  కొట్టుకుంటుంది. ఆ తర్వాత అలసిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇది కూడా ప్రమాదం. ఇలాంటి వారికి సీపీఆర్ చేస్తే ఫలితం వస్తుంది. 

సీపీఆర్ ఎలా చేయాలి...?

గుండె‌పైభాగంలో ఉండే స్టెర్నమ్ అనే ఎముక వద్ద ఒత్తిడి ఇవ్వాలి. హార్ట్‌ను స్టిమ్యులేట్ చేయాలి.  అయితే ఎంత ఒత్తడి చేయాలో అంతే చేయాలి. అతిగా ప్రెజర్ ఇస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగని తక్కువగా కూడా చేయొద్దు. ఓ  మోతాదులో సీపీఆర్  చేయాలి. అందుకే దీని కోసం ప్రత్యేకంగా  శిక్షణ ఇస్తారు. 

https://twitter.com/cpcybd/status/1629069600322375682

రోగి అస్వస్థతకు గురైన ప్రాంతంలో బెడ్ లాంటిది ఉంటే వాటిపై పడుకోబెట్టాలి అందుబాటులో లేకపోతే  నేల మీద పడుకోబెట్టి సీపీఆర్ చేయొచ్చు. ఇద్దరు వ్యక్తులు కూడా సీపీఆర్ చేయొచ్చు. ఇందులో ఓ  వ్యక్తి సీపీఆర్ చేస్తుంటే.... మరో వ్యక్తి నోటి ద్వారా శ్వాస అందించాలి. ఇలా చేస్తే ఫలితం మెరుగ్గా ఉంటుంది.

సీపీఆర్ చేసే సమయంలో  శ్వాస ఆగిపోకుండా చూసుకోవాలి. హార్ట్ బీట్ రికవర్ అయ్యేలా చేయాల్సి ఉంటుంది. రక్త ప్రసరణను పునరుద్ధరించాలి. రోగి స్పందన తీరును బట్టి ప్రతి ఐదు బీట్లకు ఒకసారి నోటి ద్వారా శ్వాస ఇవ్వాలి. 

సీపీఆర్ చేసిన ఎంత సేపట్లో కోలుకుంటారు?

సీపీఆర్ చేసిన తర్వాత కొంత మంది 2 నిమిషాల్లోనే కోలుకుంటారు. మరి కొంత మందికి అదనంగా మెడికల్ సపోర్టు అవసరం అవుతుంది. ఎలక్ట్రికల్ షాక్ లాంటివి కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది.  ఇలాంటి వారు కోలుకునేందుకు అర గంట అంతకంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది.