పిల్లలకు దిష్టి ఎందుకు తగులుతుంది..తీసేటప్పుడు ఎలాంటి నియయాలు పాటించాలో తెలుసా...

పిల్లలకు దిష్టి ఎందుకు తగులుతుంది..తీసేటప్పుడు ఎలాంటి నియయాలు పాటించాలో తెలుసా...

ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారికి ఎక్కువగా దిష్టి తగులుతుంది. అసలు దిష్టి అంటే ఏంటి? పిల్లలకు దిష్టి ఎందుకు తీయాలి..  తీసేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి... పురాణాలు ఏం చెబుతున్నాయి.. సిద్దాంతుల వివరణ ఏమిటో తెలుసుకుందాం. . . . 

ఇంట్లో పిల్లలు అదే పనిగా ఏడుస్తుంటే వారికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఇతరులు మన సంతోషం చూసి అసూయ పడటాన్ని కూడా దిష్టి అంటారు. దీని వల్ల ఈర్ష్య అసూయ భావాలతో ... ఆరాధనా భావం లేదా ప్రేమభావంతో భావోద్వేగాలకి గురైనప్పుడు మనకు ఇబ్బంది కలిగుతుందరి పండితులు చెబుతుంటారు. పిల్లలకు దిష్టి తీయటం చాలా ఇళ్లల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందులోను పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. దిష్టి తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దాని వల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు..

పిల్లలకు దిష్టి ఎలా తీయాలి

చంటి పిల్లలకు సాధారణంగా కాటుకతో బుగ్గపై చుక్క పెడతారు.  అది దాదాపుగా రూపాయి బిళ్ల సైజులో పెడతారు.  ఇలా పెట్టడం వల్ల కంటి దృష్టి లోపాలు తొలగుతాయని పెద్దలు చెబుతుంటారు.  పిల్లలకు నరదిష్టి తగిలితే  అన్నం తినకుండా ఏడుస్తుంటారు.  అలాంటి సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తారు.. ఆ తరువాత ఆ ఉప్పును రోడ్డు కూడలిలో పడేయాలని చెబుతుంటారు.  కాని ఇలా పడేస్తే దాని దాటిన వారికి కొన్ని అనర్దాలు వచ్చే అవకాశం ఉంటుంది.  అలా రోడ్డు మీద వేయకుండా.. దగ్గరలో ఉన్న నీళ్ల కుంటలలో గాని.. చెరువుల్లో గాని...  లేదా ఏదైనా చెట్టు మొదట్లో కాని వేయాలి. గేదెలు పాలు ఇవ్వకపోయినా కాని ఉప్పుతో దిష్టి తీస్తారు.

సాధారణంగా పిల్లలు అప్పుడప్పుడు కిందపడుతుంటారు.  ఆ సమయంలో వారు దడుచుకుంటారు ( బెదిరిపోయి).  ఆసమయంలో కర్పూరంతో దిష్టి తీయాలి.  ఒక పళ్లెంలో కర్పూరాన్ని వెలిగించి తల నుంచి పాదాల వరకు క్లాక్​ వైజ్​ డైరక్షన్​ లో మూడు సార్లు... అలాగే ఏంటీ క్లాజ్​ వైజ్​ డైరక్షన్​ లో మూడుసార్లు తిప్పి పక్కన పడేయాలి.  కర్పూరం కరిగినట్లు.. భయ, బెరుకు కూడా కరిగి పోతుందని విశ్వసిస్తారు.  ఆ తరువాత పిల్లలను కాళ్లు, చేతులు, ముఖం, కడుక్కొని... బట్టలు మార్చుకోవాలి.  ఇలా సూర్యాస్తమయం అయిన తరువాత రాత్రి వేళల్లో దిష్టి తీయాలి.  

సాధారణంగా చంటి పిల్లలు కేరింతలు కొడుతుంటారు.  వారి నవ్వు చాలా అందంగా ఉంటుంది.  ముఖ వర్చస్సు విషయంలో చెప్పనక్కరలేదు.  లేత ముఖం ఎంతో అందంగా ఉంటుంది.  కొంతమంది చూపు పడితే వెంటనే దిష్టి తగులుతుంది.  ప్రతి రోజు ఒకే సమయంలో జ్వరం తగులుతుంది.  మందులు వాడితే తగ్గుతుంది.  మరల ఆ తరువాత రోజు అదే సమయానికి జ్వరం తగులుతుంది.  అలా వస్తుంటే  ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి.. రెండు ముద్దలు కలిపి.. ఒకదానిలో కుంకుమ.. మరో దానిలో పసుపు కలపాలి. దీనిని ఎర్రన్నం... పచ్చన్నం అంటారు.  ఆ తరువాత రెండు గ్లాసుల్లో నీరు తీసుకొని.. ఒకదానిలో పసుపు.. మరో దానిలో కుంకుమ వేయాలి. చిన్న సైజు బొగ్గు కూడా ఉంచి.. క్లాక్​ వైజ్​ డైరక్షన్​ లో మూడు సార్లు.. యాంటీ క్లాక్​ వైజ్​ డైరక్షన్​ లో మూడు సార్లు తిప్పి... దూరంగా ఏదేని చెట్టు మొదట్లో వేయాలి.  

రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. తల్లి దిష్టి.. అన్నీ తుడిచి పెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. ఈ విధంగి రోజూ చేస్తే మంచిది. 

రేణుకా దేవి స్మరణ

ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్‌ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకా దేవిని స్మరించుకోవాలి. రేణుకా దేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు అని అంటారు.

దిష్టి తగలకుండా ఉండాలంటే....

  • పసి పిల్లలని చీకటి పడిన తర్వాత, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు.
  • ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొడతారు. కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్లేటు చుట్టూ ఒక ముద్ద దిష్టి తీసి కాకికి పెడతారు. ఇంటికి వచ్చిన వారికి ఫలం, పానీయం ఇస్తారు. పితృ దేవతలను, భగవంతుడిని తలుచుకుని వారికోసం ఒక ముద్ద పక్కన పెడతారు.
  • నుదుట బొట్టు పెట్టుకోవడం, నల్ల మొలతాడు కట్టుకోవడం, మెడలో ఆంజనేయస్వామి ... ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం, తినే ఆహార పదార్ధాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం కూడా దిష్టి తీసే విధానాలు.
  • కొంతమంది ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన .. వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ మాత, గౌరి దేవి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కూడా దిష్టి తీయడంలో ఒక భాగమే.
  • కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటి పనులు దిష్టి తగలకుండా చేస్తారు.