రామ్​ అంటే ఏమిటి.. శ్రీరామ నామం తారకమంత్రం ఎలా అయిందో తెలుసా..

రామ్​ అంటే ఏమిటి.. శ్రీరామ నామం తారకమంత్రం ఎలా అయిందో తెలుసా..

మన భారతదేశంలో రామ్ అనే పేరు ఎంతో ప్రసిద్ధి చెందినది.  రామ్​ అనే పేరు సంస్కృత పదం.. ఇది  ఎంతో శక్తివంతమైనదని పురాణాలు చెబుతున్నారు.  ఎందుకంటే రామ్ అనే పేరుకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది.  రామ్ అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శ్రీరాముడు, ఆయనే రామాయణ కథానాయకుడు..  ధర్మానికి కట్టుబడి రాజ్యాన్ని పాలించిన  ధర్మ రక్షకుడు...  పురుషులలో సర్వోన్నత గుణాలు కలిగిన పురుషోత్తముడు.. . ఇలాంటి గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షాత్ భగవంతుని స్వరూపాలే, అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన పేరు నేటికీ నిలిచి ఉంది.

ప్రత్యేకంగా హిందువులలో రామ్, శ్రీరామ్, జానకీరామ్, తారకరామ్ అంటూ రాముని పేరును తమ పేర్లుగా పెట్టుకుంటారు. మంచి గుణవంతుడు అయిన వారిని 'రాముడు మంచి బాలుడు' గా అభివర్ణిస్తారు. సిద్ధ యోగ మార్గంలో జపించే నామసంకీర్తనలలో మనకు తరచుగా వినిపించే భగవంతుని సంస్కృత నామాలలో రాముని​ పదం  కూడా ఒకటి. రామ అనే పేరు సంస్కృత పదం రామ్ నుండి వచ్చింది.   ఈ పదానికి ప్రశాంతత, విశ్రాంతి, ఆనందం, సంతోషపరచడం' ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారంగా సంతోషపెట్టువాడు, ఆనందకారకుడు, ప్రశాంత వదనుడు, ప్రకాశవంతుడు రాముడు అవుతాడు. దశరథుడి ఆనందం శ్రీరాముడే కాబట్టి దశరథ నందనుడిగా, వెన్నెల వంటి చల్లని ప్రకాశాన్ని పంచుతాడు కాబట్టి రామచంద్రుడు.. రామచంద్ర ప్రభువులా, రఘు వంశానికి చెందిన వాడు కాబట్టి రాఘవగా శ్రీరాముడిని వివిధ పేర్లతో పిలుచుకుంటారు.

వాల్మీకి మహర్షి రచించిన గొప్ప సంస్కృత పురాణ కావ్యమైన రామాయణం శ్రీరాముని జీవితాన్ని వివరిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని నమ్ముకొన్నాడు, యుద్ధాన్ని గెలిచి వీరుడనిపించుకున్నాడు, శత్రువులను సైతం కరుణించే కరుణామయుడయ్యాడు, ధర్మసంస్థాపనకు వచ్చిన సాక్షాత్ విష్ణువు ఏడవ అవతారంగా కీర్తి పొంది, దేవుడయ్యాడు. అందుకే రామ నామం ఒక మంత్రం అయింది. ఆపదల నుంచి కాపాడే శ్రీరామ రక్ష అయింది.

 రామ నామం తరచుగా తలుచుకునేందుకు తమ పిల్లలకు పేర్లుగా పెట్టుకుంటారు. కేవలం దీనిని పేరుగా మాత్రమే కాకుండా శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా శ్రీరామ్ లేదా సియా రామ్ లేదా సీతా రామ్ అంటూ అభినందించుకుంటారు. అలాగే 'జై శ్రీరామ్' అంటూ నమస్కారం పెడుతూ తమ అత్యుత్తమ సంస్కారాన్ని ప్రదర్శిస్తారు.