చంద్రగ్రహణం సమయం ఇదే... ఇంట్లో ఆహార పదార్థాలపై దర్భ ఎందుకు వేస్తారో తెలుసా... ...

చంద్రగ్రహణం  సమయం ఇదే...  ఇంట్లో ఆహార  పదార్థాలపై దర్భ ఎందుకు వేస్తారో తెలుసా... ...

చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎలా ఏర్పడుతుందో చాలా మందికి తెలియదు. సూర్య చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అలా పూర్తిగా భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు పూర్తిగా చీకటిగా మారిపోతాడు. ఈ ప్రక్రియను సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. భూమి నీడ చంద్రుడి మీద కొంతభాగమే పడితే దానిని పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తారు. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని, పాక్షిక చంద్రగ్రహణాలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాగా భూమి సైజు చంద్రుడికి 4 రెట్లు అధికంగా ఉంటుంది.

హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు గ్రహణాలు అశుభకరంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా  చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్దరాత్రి సంభవించబోతోంది. పాక్షిక చంద్ర గ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 28 అర్ధరాత్రి 01:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:22 గంటలకు ముగుస్తుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం సూతకం అక్టోబర్ 28 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అంతేకాదు ఈ సూతకాలం చంద్రగ్రహణం ముగిసే వరకు ఉంటుంది.  పంచాంగాల ప్రకారం చంద్రగ్రహణ  సూతక కాలం ఎల్లప్పుడూ 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో రేపు సాయంత్రం 4 గంటల నుండి చంద్రగ్రహణ సూతకం ప్రారంభమవుతుంది.

2023లో ఇదే చివరిదైన చంద్రగ్రహణం.  ముఖ్యంగా గ్రహణం సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్ధాలపై దర్భ లేదా గడ్డి (గరిక)  వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. దర్భలు చాలా పవిత్రమైనవి. అందుకే వాటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతుంటారు. గ్రహణ సమయంలో సూర్యుడు లేదా చంద్రుడు నుంచి కాస్మొటిక్ రేడియేషన్ వస్తుంది. దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తాయి. గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే తినే పదార్ధాలపై దర్భలను ఉంచితే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి అశ్వినీ నక్షత్రంలో సంభవించే గ్రహ చంద్రగ్రహణం సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం.
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం.. చంద్రగ్రహణం మేష రాశి ...అశ్విని నక్షత్రంలో సంభవిస్తుంది.. కనుక దీని ప్రభావాన్ని నివారించడానికి.. ఈ రాశి, నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పొరపాటున కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, వృశ్చికం, కుంభం రాశుల వారికి ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం శుభప్రదంగా ఉంటుంది. అదే సమయంలో మేష, కన్య, తుల, మకరం, మీన రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ALSO READ :బీఆర్ఎస్ పార్టీ ఓట్లను కొనుక్కుంటుంది: సీతక్క