నీటి బొట్టు విలువెంత

నీటి బొట్టు విలువెంత

భూమ్మీద 70 శాతానికిపైగా నీరుంటే. .అందులో స్వచ్ఛమైన నీరు చాలా తక్కువ. తాగు, సాగు నీటి శాతం కేవలం 2.7 శాతం మాత్రమే. ఇందులో 75 శాతం మంచు రూపంలో ఉంటే.. 22 శాతం భూగర్భ జలాల రూపంలో ఉంది . మిగతాది సరస్సు లు, నదులు, వాతావరణం, తేమ, చెమ్మల రూపంలో ఉంటుంది . ఈ నీటిలో కూడా మనం ఉపయోగించేది చాలా తక్కువ. భూమి ఏర్పడినప్పుడు మంచి నీరు ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది . కానీ, ఆ నీటిని ఉపయోగించుకునే జనాభా మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతోంది . దీనికితోడు పట్టణీకరణ, పారిశ్రామిక కాలుష్యం, మురుగు నీటి సమస్య కూడా స్వచ్ఛమైన నీటికి సవాలుగా మారాయి. ప్రస్తు తం వందల కోట్ల మంది సురక్షితమైన నీటికి దూరంగా ఉంటున్నా రు. పని చేసే చోట,బడిలో, ఫ్యాక్టరీల్లో ఎక్కడ చూసిన స్వచ్ఛమైన నీటి కొరత కనిపిస్తుంది . రానున్న తరానికి ఇది మరిన్ని కష్టాలు తెచ్చిపె ట్టడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నా రు. ఈ నేపథ్యంలో అమూల్యమైన నీటి విలువ తెలియజేయడానికి, దానిని వృథా చేయకూడదనే అవగాహన కల్పించడానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉండాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. 1993 నుంచి ప్రతి ఏటా మార్చి 22వ తేదీని ప్రపంచ జలదినోత్సవం’గా నిర్వహిస్తోంది . మన చేతు(త)ల్లోనే ఉంది వ్యక్తిగతంగా కూడా ప్రతి మనిషి నీటి పొదుపు పట్ల శ్రద్ధ వహిస్తే రోజుకు ఎన్నోలీటర్ల నీటి వృథాను అరికట్టవచ్చు. చిన్న పనుల్లో శ్రద్ధ తీసుకుం టే నెలలో 300 గ్యాలన్ల దాకా మంచి లేదా స్వచ్ఛమైన నీరు ఆదా అవుతుంది . పారబోయొద్దు నీటిని సాధ్యమైనంత వరకు పొదుపుచేయాలి. కూరగాయలు, బియ్యం, పండ్లు కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పోయొచ్చు. రీ సైకిల్డ్‌ వాటర్‌ ను టాయిలెట్ల అవసరాల కోసం ఉపయోగించాలి. తద్వారా 30 నుంచి 40 శాతం వాటర్‌ బిల్లును ఆదా చేయొచ్చు. అలాగేనేలను కడిగేందుకు ఉపయోగించే నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఇంకుడు గుంతలు ఏర్పా టు  చేసుకోవడం వల్ల భూగర్భ జలాలను నిల్వ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో‘రెయిన్‌‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌ ’ ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి వేసవిలో ఉపయోగించుకుంటున్నా రు. ప్రస్తు తం నగరాల్లో ఈ తరహాలో నీటిని పొదుపు చేస్తు న్న వాళ్లు ఉన్నారు.

నల్లా నీరు వృథా….

ముఖం కడిగేటప్పుడు, బ్రష్‌ చేసేటప్పుడు, పాత్రలు తోమేటప్పుడు వాష్‌ బేసిన్ల దగ్గర నీటిని వృథా చేస్తుంటారు చాలామంది . బెంగళూరులో ఒక్క రోజులో ఈ విధంగా 360 మిలియన్ల నీరు వృథా అవుతుందని ఆ మధ్య ఓ సర్వే రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఈ అలవాటును తగ్గించుకోలేకపోయినప్పటికీ ఏరేటర్స్‌‌  ద్వారా రన్నింగ్ ట్యాప్‌ ల నుంచి నీరు వృథా కాకుండా చేయొచ్చు. ఇవి నిమిషానికి 35 నుంచి 40 శాతం నీటిని సేవ్‌ చేస్తాయి. కిచెన్‌‌ సింక్‌ , వాష్‌ బేసిన్‌‌ల దగ్గర వీటిని ఉపయోగించవచ్చు. బిగించేందుకు ప్లం బర్‌ అవసరం కూడా లేదు. అలాగే పంపుల లీకేజీ లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. స్మార్ట్‌‌ షవర్స్‌‌షవర్‌ బాత్‌ ల ద్వారా నిమిషానికి ఏడు లీటర్ల నీరు పోతుందని మీకు తెలుసా?.. అంటే ఆరేడు నిమిషాలకు గాను ముప్ఫై నుంచి ముప్ఫై ఐదు లీటర్ల నీరు వృథా అవుతుందన్న మాట. అందుకే‘బకెట్‌ బాత్‌ ’కి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వృథాను అరికట్టవచ్చు. షవర్‌ బాత్ తప్పదనుకుంటే వాటర్‌ సేవింగ్‌ షవర్‌ హెడ్స్‌‌ బిగించడం వల్ల వాటర్‌ వేస్టేజ్‌ ను 80 శాతం తగ్గించవచ్చు.నీటిని మనం ఉత్పత్తి చేయలేం అందుకే సంరక్షించుకోవాలి.

ఆర్గానిక్‌ ఎరువు….

కంపోస్టింగ్‌ .. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసుకోవడం. ఆర్గానికి ఎరువులను సొంతంగా తయారు చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది . ఈ మధ్య కాలంలో అర్బన్‌‌ సెటప్‌ కల్చర్‌ పెరిగిపోయింది.ఇంట్లోనే మొక్కలు పెంచుకుంటున్నారు చాలామంది . ఇలాంటి సందర్భాల్లో నీటి అవసరం కూడా ఎక్కువ పడుతోంది . సొంతంగా తయారు చేసిన ఎరువులను ఉపయోగించడం వల్ల నీటిని కొంత వరకు ఆదా చేయొచ్చు. సమయం లేదనుకుంటే ఆర్గానిక్‌ ఎరువులను మార్కెట్‌ లో కొనుగోలు చేసుకోవచ్చు.

సేఫ్‌ (వ్‌ ) వాటర్‌….

శానిటరీ నాప్‌ కిన్లు , షాంపూ బాటిళ్లు,ప్లాస్టి క్‌ టూత్‌ బ్రష్‌ లు వాడకం తర్వాత ఏంజరుగుతుం దో తెలుసా? మన దగ్గర వీటిని రీసైక్లింగ్‌ చేయడం తక్కువ. చెత్త కుప్పలపై లేదంటే నీళ్లపై పడేసి పర్యావరణాన్ని పాడు చేస్తుంటాం . ప్లాస్టి క్‌ కారకాలు సముద్ర జీవనాన్ని ఏ విధంగా చిన్నా భిన్నం చేస్తాయో కళ్లారాచూస్తున్నాం. అందుకే ఇకో–ఫ్రెండ్లీ’వ్యక్తిగత ఉత్పత్తులను ఉపయోగించాలి.

లాండ్రీ వాష్‌…..

బట్టలు ఉతికేటప్పుడు నీటి వృథా ఎక్కువగా ఉంటుంది . అందుకే బకెట్‌ లలో నీటిని పొదుపుగా వాడి ఉతుక్కోవాలి. వాషింగ్‌ మెషిన్‌‌లను బట్టల లోడ్‌‌ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. దాని వల్ల నీటిని ఆదా చేయొచ్చు. ఇకో–ఫ్రెండ్లీ, నాన్‌‌–టాక్సి క్‌ డిటర్జెంట్‌ ను ఉపయోగించినా కొంత నీటిని ఆదా చేసిన వాళ్లం అవుతాం.