Ugadi 2024 : ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి.. అందులో ఏం ఉండాలి.. విశిష్ఠత ఏంటీ..!

Ugadi 2024 : ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి.. అందులో ఏం ఉండాలి.. విశిష్ఠత ఏంటీ..!

ఉగాది పచ్చడిని ఒక్కో చోట ఒక్కో విధంగా తయారు చేస్తుంటారు. కానీ, ఎక్కడి వాళైన సరే.. అందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, నగదు అనే ఆరు రుచులను తప్పకుండా ఉండేలా చూస్తారు. ఈ పచ్చడి కోసం చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం, జీలకర్ర, మిరపకాయ వంటివి వాడుతుంటారు. ఇన్ని కలిపి చేసిన ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని అంటారు పెద్దలు.

ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుంచి శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆ సంవత్సరమంతా రోగాలేవీ దరిచేరవనే నమ్మకం కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని 'నింబ కుసుమ భక్షణం', 'అశోకకళికా ప్రాశనం" అంటారు. రుతువులలో వచ్చే మార్పుల వల్ల వచ్చే రోగాల నుంచి రక్షణగా, ఈ పచ్చడిని ఔషధంగా తీసుకోవడం పూర్వం నుంచే ఆనవాయితీగా వస్తోంది. 

పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేషగాలి ఆటలమ్మ, అమ్మోరు లాంటి అంటురోగాలను దగ్గరకి రానివ్వకుండా కాపాడుతుంది. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది. మిరియాలు దగ్గు, జలుబు, పైత్యాలను అదుపులో ఉంచుతాయి. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింతపండు మలబద్దకాన్ని, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉప్పు ఎండాకాలంలో వచ్చే డీ హైడ్రేషన్ని తగ్గిస్తుంది.

సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలనే సందేశాన్ని కూడా ఉగాది పచ్చడి ఇస్తుంది. బెల్లం తీపి అనేది సంతోషానికి, ఉప్పు- జీవితంలో ఉత్సాహానికి, వేప పువ్వు- చేదు బాధ తాలూకు అనుభవాలకు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు, పచ్చి మామిడి ముక్కల పులుపు కొత్త సవాళ్లకు, కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం అని చెప్తారు.