ఈ మోసాలను ఎలా గుర్తించాలంటే?

ఈ మోసాలను ఎలా గుర్తించాలంటే?

ఫ్రాడ్​ చేసేవాళ్లకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒక విధంగా కుదరకపోతే మరో విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి.. టెక్నాలజీ వాడేవాళ్లంతా.. ఎప్పటికప్పుడు అప్​డేటెడ్​గా ఉండాలి. సైబర్​ క్రైంల గురించి తెలుసుకోవాలి. అవి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరితో అయినా తెలివిగా ప్రవర్తించాలి. కొన్నిసార్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా మోసపోతుంటారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. 

  • విమానాశ్రయాలతో సహా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌‌లను అస్సలు వాడొద్దు. 
  • పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే బదులు పవర్ బ్యాంకులను వెంట తీసుకెళ్లాలి. వాటిని పబ్లిక్​ ఛార్జింగ్​ స్టేషన్ల నుంచి ఛార్జ్​ చేసి, వాటితో ఫోన్లకు ఛార్జింగ్​ పెట్టుకోవాలి. 
  • యూఎస్​బీ ద్వారా కనెక్ట్ చేసేటప్పుడు ఫోన్​లో వచ్చే టాప్​–అప్ ఆప్షన్లలో ​ఆటోమేటిక్ డేటా ట్రాన్స్​ఫర్​ని క్యాన్సిల్​ చేయాలి. 
  • ఒకవేళ తప్పనిసరి పబ్లిక్​ ఛార్జింగ్​ స్టేషన్లలో ఛార్జింగ్‌‌ పెట్టాల్సి వస్తే.. కేవలం ఛార్జింగ్​ చేయడానికి మాత్రమే పనికొచ్చే డాటా కేబుల్స్​ని వాడాలి.  
  • ఆన్‌‌లైన్‌‌లో పరిచయమైన వ్యక్తులకు మీ అడ్రస్​, ఆర్థిక వివరాలు, ప్రభుత్వం ఇచ్చే ఐడీ నెంబర్లు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని చెప్పొద్దు.
  • ఆన్‌‌లైన్‌‌లో బ్రౌజింగ్​ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌‌లపై అస్సలు క్లిక్​ చేయకూడదు. ఫోన్​లో అవసరం లేని యాప్స్​ని ఇన్​స్టాల్​ చేయకూడదు. చేసినా.. పర్మిషన్లు ఇవ్వకూడదు. 
  •  వీలున్న ప్రతి చోట టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్​ని యాక్టివేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇ–మెయిల్, బ్యాంకింగ్ లాంటి వాటికి రెండోసారి అథెంటికేషన్​ చేయడం చాలా అవసరం. 
  •  మీకు తెలియకుండానే ఎవరికైనా రిమోట్ యాక్సెస్‌‌ ఇస్తే.. తెలిసిన వెంటనే యాక్సెస్ తొలగించాలి. సాధ్యం కాకపోతే.. వెంటనే కంప్యూటర్, స్మార్ట్​ఫోన్​కు ఇంటర్నెట్ డిస్‌‌కనెక్ట్ చేయాలి. 
  • పర్సనల్​, ఆర్థిక సమాచారం అడిగే కమ్యూనికేషన్‌‌లతో జాగ్రత్తగా ఉండాలి. 
  • సెన్సిటివ్​ విషయాలను పంచుకునే ముందు అవతలి వాళ్లు ఎవరు? ఏంటనేది కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. 
  •  వాడుతున్న అన్ని డివైజ్​ల్లో నమ్మదగిన సెక్యూరిటీ సాఫ్ట్‌‌వేర్‌‌ని ఇన్‌‌స్టాల్ చేసుకోవాలి. 
  • ఏదైనా లావాదేవీ చేసే ముందు యూపీఐ హ్యాండిల్స్, వెబ్‌‌సైట్‌‌లను ఒకటికి రెండుసార్లు చెక్​చేసుకోవాలి.