Good Health: వాకింగ్​ తరువాత ఏం తినాలో తెలుసా..

Good Health: వాకింగ్​ తరువాత ఏం తినాలో తెలుసా..

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు సైతం ఎక్కువగా నడవాలని చెబుతుంటారు. ఇక మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో తప్పకుండా డైట్‌లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.అయితే కొందరు తమకు తెలియకుండా తీసుకునే కొన్ని ఆహారాలు అనారోగ్య సమస్యలను పెంచుతాయి. కాబట్టి మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఉదయం డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నడక నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాదం, ఖర్జూర వాల్ నట్ వంటి మిశ్రమ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటిన్స్, విటమిన్స్, ఫైబర్, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే మార్నింగ్ వాక్ తర్వాత ఉదయం మొలకలు తినడం ఆరోగ్యానికి మరీ మంచిదంటున్నారు వైద్యులు. దీని వలన ఈజీగా బరువు తగ్గడమే కాకుండా ఊబకాయం నుంచి బయటపడవచ్చును.

 ఇందులో ఉండే అధిక ఫైబర్ మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచి , శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. వీటితో పాటు ఉదయం ఖాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది. పండ్లు తినడం ద్వారా, విటమిన్లు A, C, K , E కాకుండా, శరీరానికి కాల్షియం, ఫోలేట్ , పొటాషియం వంటి ఖనిజాలు కూడా అందుతాయి. దీని వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. తగిన పోషకాహారాన్ని అందిస్తుంది.

వ్యాయామంలో భాగంగా చాలా మంది వాకింగ్ చేస్తూంటారు. రోజూ ఒక గంట లేదా కనీసం అరగంటైనా వాకింగ్ చేయాలని వైద్యులు కూడా సూచిస్తూంటారు. ఎక్సర్ సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం అనేక లాభాలు ఉన్నాయి. చాలా మందికి వాకింగ్ చేయం కూడా ఇష్టమే. సరదాగా వారి పార్టనర్స్, పిల్లలు, ఫ్రెండ్స్ లేదా కొలిగ్స్ తో వాకింగ్ చేస్తూంటారు. కుదిరిన వారు ఉదయం, సాయంత్రం కూడా వాకింగ్ చేస్తారు. కుదరని వారు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేస్తూంటారు. అయితే వాకింగ్ చేస్తూ సరదగా మాట్లాడుకుని వెళ్తూండటం కామన్. ఒంటరిగా వెళ్లిన వారు మాత్రం ఎయిర్ ఫోన్స్ చెవిలో పెట్టేస్తూంటారు. పాటలు వింటూ వాకింగ్ లేదా జాగింగ్ చేస్తారు. వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నో డౌట్. అయితే మాట్లాడుకుంటూ వాకింగ్ చేయడం ఎలాంటి బెనిఫిట్స్ ఉండవని వెల్లడించారు ఆరోగ్య నిపుణులు. వాకింగ్ తో బెనిఫిట్స్ పొందాలంటే సైలెంట్ వాకింగే బెటర్ అని తేల్చారు.