ఇండియాకు రానున్న వాట్సాప్‌ పేమెంట్స్‌.. ఎంత వరకు సేఫ్‌?

ఇండియాకు రానున్న వాట్సాప్‌ పేమెంట్స్‌.. ఎంత వరకు సేఫ్‌?
  • ఈ మధ్యే బ్యాన్‌ చేసిన బ్రెజిల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌
  • 2018 నుంచి ఇండియాలో ప్రవేశపెట్టేందుకు ట్రయల్స్‌

ప్రస్తుత కాలంలో ఫోన్‌ వచ్చిన తర్వాత అన్నీ మన అరచేతిలోకి వచ్చేశాయి. బ్యాంకింగ్‌ ట్రాన్‌జాక్షన్స్‌ సైతం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కూడా గూగుల్‌పే, ఫోన్‌పే తరహాలో వాట్సాప్‌ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టింది. దాదాపు 2018 నుంచి దీని మీద కసరత్తు చేస్తోంది. అయితే బ్రెజిల్‌లో దాన్ని లాంచ్‌ చేయగా.. ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ దాన్ని ఈ మధ్య సస్పెండ్‌ చేసింది. దీంతో ఇప్పుడు వాట్సాప్‌ ఇండియాపై దృష్టి పెట్టింది. వాట్సాప్‌ పేమెంట్స్‌ను ఇండియాలో ప్రవేశపెట్టాలని చూస్తోంది. కాగా.. వాట్సాప్‌ పేమెంట్స్‌ను బ్యాన్‌ చేయాలని ఇప్పికే సుప్రీం కోర్టులో విచారణ జరగుతోంది. చెల్లింపుల వ్యవస్థలో ఉన పోటీని నిర్ధారించుకునేందుకు బ్రెజిల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ దీన్ని నిలిపేసింది. చెల్లింపుల్లో నష్టాలను అంచనా వేసిన బ్యాంక్‌.. వాట్సాప్‌ నిబంధనలను కూడా పాటించడం లేదని చెప్తూ ఈ సేవలను సస్పెండ్‌ చేసినట్లు రిపోర్ట్‌ చెప్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్‌ పేమెంట్స్‌ను తీసుకురావాలని కసరత్తలు చేసిన సంస్థకు ఇది పెద్ద దెబ్బ. కేవలం బ్రెజిల్‌లో లాంచ్‌ చేసిన వారాల వ్యవధిలోనే దీన్ని నిషేధించనట్లు తెలుస్తోంది. కాగా.. బ్రెజిల్‌లో నిలిపేసిన వెంటనే ఇండియాలో ప్రవేశపెడుతున్నామని వాట్సాప్‌ అధికార ప్రతినిధి చెప్పారు. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్పేస్‌) ప్రపంచంలోనే ఇతర ప్రాంతాలకు ఒక లైట్‌హౌస్‌ మోడల్‌ అని, స్థానిక బ్యాంకులు, సంస్థలు అందరికీ ఆర్థిక సేవలను అందించగల ఒక స్థానిక స్టాక్‌పై ఆవిష్కరణలను అందిస్తున్నాయి అని వాట్సాప్‌ ప్రతినిధి చెప్పారు. కాగా.. బ్రెజిల్‌ దీన్ని నిషేధించడంతో ఎంత వరకు సేఫ్‌ అనే విషయంపై మళ్లీ చర్చ జరుగుతోంది.

2018 నుంచే బీటా వర్షన్‌

ప్రపంచంలోనే అతిపెద్ద మేసేజింగ్‌ యాప్‌గా వాట్సాప్‌ పేరుపొందింది. ఇండియాలో దాదాపు 400 మలియన్ల మంది యూజర్స్‌ ఉన్నారు. కాగా.. 2018లోనే దీనికి సంబంధించి యూపీఐ పిన్‌ ఆధారంగా బీటా టెస్టింగ్‌ చేశారు. కాగా.. రిలయన్స్‌ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్‌ 5.7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) క్లియర్‌‌ చేసిన వెంటనే ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ పేమెంట్స్‌కు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఇండియాలో యూపీఐ పేమెంట్స్‌ కూడా చాలా ఉన్నాయి. గూగుల్‌పే, అమెజాన్‌ పే, ఫోన్‌ పే లాంటివి ఇప్పటికే మనుగడలో ఉన్నందున వాట్సాప్‌ పేమెంట్స్‌ కూడా కచ్చితంగా పాపులర్‌‌ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ కరోనా కాలంలో సోషల్‌ డిస్టెంసింగ్‌ గురించి ప్రచారం జరుగుతున్నందున ఇలాంటి డిజిట్‌ పేమెంట్లు బాగా వాడకంలోకి వస్తాయని అంటున్నారు.