వాట్సప్ యూజర్స్‌ని ఆకట్టుకోవడానికి ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల స్క్రీన్‌షేరింగ్, లాక్‌చాట్, మల్టీ డివైజ్ ఫీచర్లు తీసుకొచ్చిన వాట్సప్ తాజాగా మరో న్యూ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ముందుకొచ్చింది.
ఇప్పటిదాకా ఒక ఫోన్లో ఒకే వాట్సప్ అకౌంట్‌ని లాగిన్ చేసే అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త ఫీచర్‌తో ఒక మొబైల్ లో రెండు వాట్సప్ లను లాగిన్ చేయవచ్చు. దాని వివరాలివే..ఒక వ్యక్తి దగ్గర అఫీషియల్, పర్సనల్ వాట్సప్ లు ఉంటే.. వేరే అకౌంట్లోకి లాగిన కావాలంటే మరో ఫోన్ అయినా ఉండాలి లేదా క్లోన్డ్ వాట్సప్ యాప్ అయినా యూజ్ చేయాల్సి ఉంటుంది.
రెండు మొబైల్స్ వాడటం అంటే కష్టసాధ్యమయ్యే పని. క్లోన్డ్ వాడాలంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయేమోననే భయం. వీటికి స్వస్తి పలకడానికే మెటా సంస్థ ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఒకే వాట్సప్ లో రెండు వేర్వేరు అకౌంట్లు ఉపయోగించవచ్చు.
ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వారు యాప్‌లోకి వెళ్లి క్యాఆర్ కోడ్ ఆప్షన్ దగ్గర ఉన్న బాణం గుర్తు సాయంతో మరో అకౌంట్లోకి యాడ్ కావచ్చు. దీంతోనే మరో అకౌంట్‌కి మారవచ్చు. ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలో అందరికీ వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు మెటా సంస్థ యాజమాన్యం ప్రకటించింది.