టెర్రస్ గార్డెనింగ్పై వాట్సాప్​ గ్రూప్లు

టెర్రస్ గార్డెనింగ్పై వాట్సాప్​ గ్రూప్లు
  • అవగాహన కోసం ఏర్పాటు చేసుకుంటున్న సిటిజన్లు
  • హార్టికల్చర్ ​క్లాసులకు హాజరయ్యేందుకు ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: టెర్రస్ గార్డెనింగ్​పై సిటిజన్లలో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే కరోనా తర్వాత నుంచి ఈ తరహా గార్డెనింగ్ చేస్తున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఎప్పటి నుంచో ఇంటిపై పూల మొక్కలు, కూరగాయ పంటలు పండిస్తున్నవారితో పాటు కొత్తగా నేర్చుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మిద్దెలపై, బాల్కనీల్లో కొంచెం స్థలం ఉన్నా నచ్చిన కూరగాయలు, పండ్లు పండించుకుంటున్నారు. ఈ తరహా సాగు ఎలా చేయాలి, ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకునేందుకు ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్​లో చర్చించుకుంటున్నారు. వాట్సాప్​లో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్రియేట్ చేసుకుని అవగాహన పెంచుకుంటున్నారు. హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ అధికారులను సంప్రదిస్తూ మెళకువలు తెలుసుకుంటున్నారు. 

ఇంట్లో పండించినవే తినేలా..

కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నప్పుడు బయట కూరగాయలు కొనాలంటే భయపడిన చాలామంది టెర్రస్ గార్డెనింగ్​పై ఫోకస్ పెట్టారు. బయటి వాటికంటే ఇంట్లో సాగుచేసుకున్నవి వండుకుంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని కూడా చాలామంది ఫీలింగ్. అందుకే హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ నిర్వహించిన టెర్రస్ గార్డెనింగ్ ట్రైనింగ్ క్లాసులకు కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. ఫలితంగా ఉన్న కొంచెం స్థలంలోనే సాగు చేపడుతున్నారు. టమాట, వంకాయ, బీర, సోర, కాకర, బీన్స్, బెండకాయ వంటి పలురకాల కూరగాయలతో పాటు పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర వంటి ఆకుకూరల సాగు చేస్తున్నారు. వీటితో పాటు పలు రకాల పండ్ల మొక్కలను కూడా పెంచుతున్నారు.

అనుమానాలు.. సమాధానాలు

టెర్రస్ ​గార్డెనింగ్​పై ఆసక్తి ఉన్నవారు వివిధ పేర్లతో వాట్సాప్, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. దాదాపు 15గ్రూపుల్లో 23వేలమంది మెంబర్స్ ఉన్నట్లు మిద్దె తోటలు సాగు చేస్తున్నవారు చెప్తున్నారు. వీరంతా తమకున్న సందేహాలు గ్రూప్​లో పోస్ట్​ చేస్తే అనుభవం ఉన్నవారు సమాధానం ఇస్తున్నారు. ఏ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మొక్కలు సాగు చేయాలి. సేంద్రియ సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  పురుగు పట్టినప్పుడు ఏవిధంగా తొలగించాలి వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. ఇందులో హార్టికల్చర్ అధికారులు క్రియేట్ చేస్తున్న గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతోపాటు ఒక కమ్యూనిటీలో ఉంటున్నవారు కూడా వాట్సాప్ గ్రూప్​లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

వాట్సాప్ గ్రూప్​లో సజెస్ట్ చేస్తున్నాం

హార్టికల్చర్ డిపార్ట్​మెంట్​ ద్వారా టెర్రస్ గార్డెనింగ్ పై క్లాసులు చెబుతుంటాం. ఇంట్రెస్ట్​ ఉన్న వారి కోసం వాట్సాప్ గ్రూప్​లను క్రియేట్ చేస్తున్నాం. దాదాపు 20 గ్రూప్స్ ఉన్నాయి.  ట్రైనింగ్ క్లాసెస్​కు అటెండ్ అయిన వారు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు.  ఇప్పుడు చాలామంది కూరగాయలు పండిస్తున్నారు. ఎలా సాగుచేయాలి, టెక్నికల్ ఇష్యూస్​కు సంబంధించి గ్రూప్​లో ఆన్సర్ చేస్తున్నాం. - జ్యోతి, హర్టికల్చర్,  అర్బన్ ఫార్మింగ్ అధికారి 

లాక్​డౌన్ టైమ్​లో మొదలుపెట్టా..

నాకు మొక్కలంటే చాలా ఇష్టం.  మా ఇంటిపై చాలా ప్లేస్ ఉండటంతో  హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ నిర్వహించే టెర్రస్ గార్డెనింగ్ క్లాసులకు అటెండ్ అయ్యా. లాక్ డౌన్​కు ముందే మిద్దె పంటకు కావలసిన మట్టి, కంటైనర్స్, విత్తనాలు రెడీ చేసి పెట్టుకున్నా. లాక్ డౌన్ ​టైమ్​లో స్టార్ట్​చేశా. డ్రమ్​లను కట్​చేసి వాటిలో మొక్కలు పెంచడం మొదలుపెట్టా. మేం పండించిన వాటినే రోజువారీ వంటల్లో వాడుతున్నాం. పంట సాగులో ఏదైనా డౌట్ ఉంటే అధికారులను సంప్రదిస్తున్నాం.  సృజన, అల్వాల్

రెండేళ్లుగా సాగుచేస్తున్నా..

మా ఇంటి టెర్రస్​పై, ఇంటిముందు చాలా ప్లేస్ ఉంటుంది. 2020లో సాగు మొదలుపెట్టా. ఇప్పుడు దాదాపు 40 రకాల మొక్కలు పెంచుతున్నా. వాటిలో కూరగాయలు, ఆకు కూరలు, జామ, అల్లనేరేడు, నిమ్మ, ఉసిరి, సంత్రాలు లాంటి పండ్ల మొక్కలు సాగు చేస్తున్నా. వచ్చే జూన్ నాటికి 350 నుంచి 400 మొక్కలు పెంచాలనే ఆలోచనలో ఉన్నా. ఎ. శివకుమార్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, తాండూరు