వాట్సాప్ లో​ మెసేజ్ డిలీట్​ అయినా ఏం కాదు

వాట్సాప్ లో​ మెసేజ్ డిలీట్​ అయినా ఏం కాదు

వినియోగదారుల కోసం అందుబాటులోకి కొత్త వాట్సాప్ అప్ డేట్ తీసుకొచ్చింది. మనలో చాలామంది వాట్సాప్ చాటింగ్ చేస్తూ పొరపాటున వేరే మెసేజ్ లు పంపిస్తుంటారు. వాటిని డిలిట్ చేయాలనే తొందరలో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ నొక్కబోయి ‘డిలిట్ ఫర్ మి’ నొక్కుతుంటాం. ఇక చేసేదేం లేక ఇతరులకు దొరికిపోతుంటాం. దాన్ని సవరించుకునేందుకు ఈ కొత్త ఫీచర్ పని చేస్తుంది.

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. మెసేజ్ ని డిలిట్ చేసిన తర్వాత ‘డిలిట్ ఫర్ మి’, ‘డిలిట్ ఫర్ ఎర్వీవన్’ అని కనిపిస్తుంది. ఇకనుంచి వాటితో పాటు ‘అన్ డూ’ అని కనిపిస్తుంది. దాన్ని నొక్కితే మెసేజ్ డిలిట్ అవ్వదు. ప్రస్తుతం వాట్సాప్ బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.