ఒకే నెలలో 20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

ఒకే నెలలో 20 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

ప్రస్తుత కాలంలో వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీ అయింది. ఉదయం లేవడం మొదలు.. రాత్రి పడుకునే వరకు వాట్సాప్ చూడకుండా ఉండలేరు. ఈ వాట్సాప్ తో మేలెంతో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. యూజర్ల అవసరాన్ని ఆసరగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దాంతో యూజర్లు ఫిర్యాదులు చేస్తుండటంతో.. కంపెనీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. గత అక్టోబర్ నెలలో వాట్సాప్ ను దుర్వినియోగం చేసిన యూజర్లను గుర్తించి దాదాపు 20 లక్షల ఖాతాలను తొలగించినట్లు కంపెనీ ప్రకటించింది. అదే నెలలో వాట్సాప్ గ్రీవియన్స్ సెల్ కు 500 అకౌంట్లపై ఫిర్యాదులు రాగా.. వాటిలో కేవలం 18 అకౌంట్లపై మాత్రమే కంపెనీ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ లో 560 ఫిర్యాదులు రాగా.. 2.2 మిలియన్లకు పైగా అకౌంట్లు నిషేధించబడ్డాయి. అదేవిధంగా ఆగష్టులో 420 ఫిర్యాదులు రాగా.. దాదాపు 2 మిలియన్ల ఖాతాలు నిషేధించబడ్డాయని వాట్సాప్ ప్రకటించింది.

వాట్సాప్‌కు దేశవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఫేస్‌బుక్ మరియు దాని మాతృ సంస్థ మెటా.. వినియోగదారుల డేటా గోప్యతపై తీవ్రమైన ఆరోపణల రావడంతో.. అక్టోబర్‌లో 21.8 మిలియన్లకు పైగా కంటెంట్‌లను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.