సేఫ్టీ కోసం..వాట్సాప్లో కొత్త ఫీచర్

సేఫ్టీ కోసం..వాట్సాప్లో కొత్త ఫీచర్
  • సేఫ్టీ ఓవర్‌‌‌‌‌‌‌‌వ్యూ ఫీచర్​ను తెచ్చిన వాట్సప్​ 
  • 68 లక్షల ఖాతాలపై నిషేధం 

న్యూఢిల్లీ: వాట్సప్ సేఫ్టీ ఓవర్‌‌‌‌‌‌‌‌వ్యూ పేరుతో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్​ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లో లేని వారు ఎవరైనా కొత్త వాట్సప్​ గ్రూప్‌‌‌‌‌‌‌‌లోకి చేరిస్తే హెచ్చరిస్తుంది. ఒక సేఫ్టీ ఓవర్‌‌‌‌‌‌‌‌వ్యూ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. 

యూజర్​ ఆ గ్రూప్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లే ముందు, ఈ స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై ఆ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కనిపిస్తాయి. గ్రూప్ పేరు, ఎవరు సృష్టించారో తెలుస్తుంది.  ఆ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకోవచ్చు. 

ఫిషింగ్, స్కామ్‌‌‌‌‌‌‌‌ల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై కొన్ని చిట్కాలను కూడా వాట్సప్ అందిస్తుంది. యూజర్లను మోసాల నుంచి రక్షించడంలో భాగంగా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో స్కామ్ సెంటర్లకు సంబంధించిన 68 లక్షలకుపైగా ఖాతాలను గుర్తించి నిషేధించామని వాట్సప్​ప్రకటించింది.