రన్నింగ్ బస్ నుంచి ఊడిపోయిన చక్రాలు..

V6 Velugu Posted on Jul 21, 2021

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఊహించని ప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి. హైదరాబాద్ నుంచి తొర్రూర్ వెళ్తున్న బస్సు.. మూటకొండూర్ మండలం కాటేపల్లి దగ్గరికి చేరుకోగానే రాయగిరి - మోత్కూర్ ప్రధాన రహదారిపై బస్సు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంతో బస్సును అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Tagged Hyderabad, Telangana, Yadadri bhuvanagiri, wheels off from the bus, thorruru

Latest Videos

Subscribe Now

More News