ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎంపీపీని నిలదీసిన రైతులు

కోనరావుపేట, వెలుగు: కొనుగోలు సెంటర్లు ప్రారంభమైన వడ్లు తూకం వేయడం లేదని, మా వడ్లను ఎప్పుడు కొంటారని  కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ రైతులు ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ను గురువారం అడ్డుకొని నిలదీశారు. సెంటర్లో వడ్లు పోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు రెండు వ్యాన్ లోడులు మాత్రమే తూకం వేశారని.. వాటిని కూడా మిల్లర్లు సరిగ్గా దించుకోవడం లేదన్నారు. మిల్లర్లు తరుగు పేరుతో కోతలు పెడుతున్నారని, అధిక తూకం వేస్తేనే దించుకుంటున్నారని వాపోయారు. వడ్లను కొనుగోళ్లను వేగవంతం చేసేలా అధికారులు, మిల్లర్లతో మాట్లాడతానని ఎంపీపీ రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం కనగర్తి శివారులోని కనకదుర్గ రైస్ మిల్లు నిర్వాహకులతో మాట్లాడి ధర్మారం వడ్లను దించుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రాములు, లీడర్లు లక్ష్మణ్, పర్షరాములు, రైతులు పాల్గొన్నారు.

పెండింగ్​ పనులు త్వరలో పూర్తి 

వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణంలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసుకుందామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు అన్నారు.  గురువారం పట్టణంలోని ఆయన నివాసంలో  పార్టీ లీడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేద దళితులకు దళిత బంధు వర్తించేలా.. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. డిసెంబర్ 24 న జరిగే సెస్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ముంపు గ్రామాల మిగిలిన సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్​ మాధవి, జడ్పీటీసీ రవి, ఎంపీపీ వజ్రమ్మ, ప్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్​లీడర్​మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ

వేములవాడరూరల్​, వెలుగు : వేములవాడ –కోరుట్ల  ప్రధాన రోడ్డులో మర్రిపల్లి వద్ద రు. 2 కోట్లతో నిర్మించే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి  ఎమ్మెల్యే రమేశ్​బాబు భూమి పూజ చేశారు. అనంతరం కేజీబీవీలో హైమాస్ట్​ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​ అరుణ, డీఈవో రాధాకిషన్​, ఎంపీపీ మల్లేశం, సర్పంచ్​ మల్లేశం పాల్గొన్నారు.

వ్యవసాయ రంగ అభివృద్ధే సీఎం లక్ష్యం

జగిత్యాల, మెట్​పల్లి, వెలుగు: వ్యవసాయరంగ అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ ఆగ్రికల్చర్ యూనివర్సిటీ లో గురువారం ఉత్తర తెలంగాణ స్థాయి కిసాన్ మేళా- నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్​వసంత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రావు, ఏఎంసీ చైర్మన్ నక్కల రాధ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల పట్టణ పద్మనాయక వెలమ సంక్షేమ మండపంలో మాజీ మంత్రి  స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు  విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రత్నాకర్ రావుతో చిన్ననాటి నుంచి తన కుటుంబానికి సంబంధాలను ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో జువ్వాడి నర్సింగారావు, జువ్వాడి కృష్ణారావు, సభ్యులు రాంచందర్ రావు, రాజేశ్వర రావు, పురుషోత్తం రావు వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.  మెట్​పల్లి క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాయిరెడ్డి, మున్సిపల్​చైర్ పర్సన్ సుజాత,  వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు 

గోదావరిఖని, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా 100 శాతం రాయితీతో చేప పిల్లల సరఫరాలో భాగంగా గురువారం  రూ.40 లక్షల విలువైన చేప పిల్లలను గోదావరి నదిలో వదిలిపెట్టారు. అనంతరం స్థానిక మార్కండేయ కాలనీలో 200 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌ చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాలలో డిప్యూటీ మేయర్ అభిషేక్‌‌ రావు, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ కమార్‌‌ దీపక్‌‌, మేయర్‌‌ అనిల్‌‌ కుమార్‌‌, మున్సిపల్‌‌ కమిషనర్​‌ బి.సుమన్‌‌రావు, డీఎఫ్​వో భాస్కర్ నాయక్, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు. 

సింగరేణి ఆర్వో ప్లాంట్లు ప్రారంభం

సింగరేణి 5వ ఓపెన్‌‌కాస్ట్‌‌ విస్తరణలో భాగంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు  తిలక్‌‌నగర్‌‌ డౌన్‌‌ ఏరియా, జవహర్‌‌లాల్‌‌ నెహ్రూ స్టేడియం పక్కన, గాంధీనగర్‌‌ స్విమ్మింగ్‌‌ ఫూల్‌‌ పార్క్‌‌ వద్ద రక్షిత మంచినీటి సరఫరా కోసం ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గురువారం సింగరేణి జీఎం కె.నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌, డిప్యూటీ మేయర్ అభిషేక్‌‌ రావు ఆర్వో ప్లాంట్లను
 ప్రారంభించారు. 

రోళ్లవాగు ప్రాజెక్టును పునరుద్ధరించాలి 

రోడ్డుపై బైఠాయించిన బీజేపీ లీడర్లు 

జగిత్యాల, వెలుగు: రోళ్లవాగు ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని బీజేపీ నియోజకవర్గ లీడర్​పన్నాల తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలంలో భారీ వర్షాలతో రోళ్లవాగు ప్రాజెక్ట్ ​తెగిపోయిందని, దీంతో బీర్పూర్, ధర్మపురి మండలాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రాజెక్టు డీఈఈ చక్రునాయక్ ఫోన్​లో మాట్లాడుతూ యాసంగి సీజన్​కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ బీర్పూర్ మండల అధ్యక్షుడు మ్యాడ జనార్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘు వీరారెడ్డి, మార్కండేయ, రైతులు పాల్గొన్నారు.

పట్టుదలతో చదువుకోవాలి

గంభీరావుపేట, వెలుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో కష్టపడి చదవాలని ఎస్పీ రాహుల్ హెగ్డే  సూచించారు. గురువారం గంభీరావు పేట  మండల కేంద్రంలోని ప్రభుత్వ  డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీకి ఎస్పీ చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్​కోసం కలలు కంటారని, వారి ఆశలను వమ్ము చేయొద్దన్నారు. తల్లిదండ్రులు, టీచర్ల మాటకు విలువనిస్తూ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దాస్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీవల్లి, ఎంపీపీ కరుణ, సీఐ మొగిలి, ఎస్సై మహేశ్, లెక్చరర్స్, విద్యార్థులు  పాల్గొన్నారు.