న్యూ ఇయర్ వేడుకలు ఏ దేశంలో ఎప్పుడంటే..?

న్యూ ఇయర్ వేడుకలు ఏ దేశంలో ఎప్పుడంటే..?

ఇండియన్ టైం ప్రకారం.. న్యూజిలాండ్ లో శనివారం మధ్యాహ్నం 3.45కు, ఆస్ట్రేలియాలో సాయంత్రం 6.30కు, జపాన్, కొరియాల్లో రాత్రి 8.30కు, చైనా, ఫిలిప్పీన్స్, సింగపూర్ లలో రాత్రి 9.30కు కొత్త సంవత్సరానికి జనం వెల్ కం చెప్పారు. బంగ్లాదేశ్ లో రాత్రి 11.30కు, నేపాల్ లో 11.45కు, శ్రీలంక లో మనతో పాటే 12 గంటలకు, పాక్​​లో 12.30కు సెలబ్రేషన్స్ షురువయ్యాయి. 

ఇక యూరప్ దేశాలకు జనవరి 1న తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 మధ్య న్యూ ఇయర్ వస్తుంది. బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ  వంటి దేశాలు పొద్దున 8.30కు, అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్ వాసులు ఉదయం 10.30కు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడ్తారు. అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గంట టైమ్ తేడాతో వేడుకలు జరుగుతా యి. హవాయిలో మధ్యాహ్నం 3.30కు జరుగుతాయి.