317జీవోతో మరో నిండు ప్రాణం బలి.. ఇవన్నీ కేసీఆర్ చేసిన హత్యలే

317జీవోతో మరో నిండు ప్రాణం బలి.. ఇవన్నీ కేసీఆర్ చేసిన హత్యలే
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 

హైదరాబాద్: 317జీవోతో మరో నిండు ప్రాణం బలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో బేతల సరస్వతి అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 317 జీవో తో  నష్టపోయిన మరో బాధితురాలు బలవన్మరణానికి పాల్పడడం.. ఇవన్నీ కేసీఆర్ చేసిన హత్యలేనన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరూ మనోధైర్యం కోల్పోవద్దని, మీ తరపున మేము పోరాడుతున్నామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ సర్కార్ వచ్చాక ఈ జీవో ను సమీక్షిస్తాని బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. 

 

 

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1673 కేసులు..ఒకరు మృతి

మహిళలతో కలసి కోలాటం ఆడిన మంత్రి

ధనిక రాష్ట్రంలో 9వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాల్లేవు

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి