ఇన్‌‌స్టాలో మొత్తం ఫొటో రావాలంటే

ఇన్‌‌స్టాలో మొత్తం ఫొటో రావాలంటే

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఫొటో అప్‌‌లోడ్ చేసేటప్పుడు డీఫాల్ట్‌‌గా ఫొటో క్రాప్ అవుతుంటుంది. ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఏదైనా ల్యాండ్‌‌స్కేప్ లేదా పోట్రెయిట్ ఫొటోలు అప్‌‌లోడ్ చేద్దామంటే అందులో సగానికి పైగా క్రాప్ అవుతుంది. అయితే కొన్ని టిప్స్‌‌తో ఈ ప్రాబ్లమ్‌‌కు చెక్ పెట్టొచ్చు.

ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఫొటో అప్‌‌లోడ్ చేసేటప్పుడు ఫొటో కింద ఎడమవైపున ఎక్స్‌‌ప్యాండ్  సింబల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే ఫొటో డైమెన్షన్ కొంత మారుతుంది. లేదా రెండు వేళ్లతో ఫొటోను కావాల్సినట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అప్పటికీ ఫొటోలో కొంత కట్ అవుతుంటే థర్డ్ పార్టీ యాప్స్‌‌ వాడాలి.

ప్లే స్టోర్‌‌‌‌లో ‘నో క్రాప్ ఫర్ ఇన్‌‌స్టాగ్రామ్’ పేరుతో కొన్ని యాప్స్ దొరుకుతాయి. వాటిని ఇన్‌‌స్టాల్ చేసుకుంటే క్రాప్ అవ్వకుండా ఫుల్ ఇమేజ్‌‌ను ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో అప్‌‌లోడ్ చేసుకోవచ్చు. ఫొటోను ఆ యాప్‌‌లో అప్‌‌లోడ్ చేసి నచ్చినట్టుగా సైజుని అడ్జస్ట్ చేసుకోవచ్చు.