
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో చెప్పాలంది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పోస్టులకు ఎన్నికలు జరపడం లేదంటూ లాయర్ ఆర్ భాస్కర్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. రాష్ట్రంలో 220 సర్పంచ్‌లు, 94 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ సభ్యులు, 5,364 వార్డు మెంబర్లు. 344 ఉప సర్పంచ్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.