ఏ డ్రెస్​కి ఏ జువెలరీ సెట్​ అవుతుందంటే..!

ఏ డ్రెస్​కి ఏ జువెలరీ సెట్​ అవుతుందంటే..!

ఎంత సింపుల్​ డ్రెస్​ వేసుకున్నా.. దానికి సూటయ్యే జువెలరీ పెట్టుకుంటేనే బాగుంటుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏ డ్రెస్​కి ఏ జువెలరీ సెట్​ అవుతుందనేదే. ఈ విషయంలో చాలామంది ఆడవాళ్లు తికమక పడుతుంటారు. చివరికి కాంప్రమైజ్​ అయి  ఏదో ఒక జువెలరీని వేసుకుంటారు. ఇదే పెద్ద మిస్టేక్​ అంటున్నారు ఫేమస్​ జువెలరీ డిజైనర్స్​ పూర్వి అషీర్​, రూపేష్​ జైన్​. అంతేకాదు ఏ అవుట్​ఫిట్​కి ఏ జువెలరీ నప్పుతుందో కూడా చెప్తున్నారు. 

రెగ్యులర్​ వేర్​ అంటే ఆఫీసులకి, కాలేజీలకి వేసుకెళ్లే క్యాజువల్​ డ్రెస్​లన్నమాట. వీటిపైకి చిన్న ముత్యాల ఇయర్​రింగ్స్​ బాగుంటాయి. సాదాసీదా గోల్డ్ డ్యాంగ్లర్స్​ కూడా ట్రై చేయొచ్చు. అందులోనూ14 లేదా18 క్యారెట్ల గోల్డ్​ డ్యాంగ్లర్స్​ స్కిన్​ని మెరిసేలా చేస్తాయి. ఎలాంటి క్యాజువల్​ వేర్​కైనా ఇవి స్టైలిష్​ లుక్​ ఇస్తాయి. సింగిల్​​ డైమండ్​ జువెలరీ సాలిటైర్స్​. రింగ్, నెక్లెస్​, ఇయర్​ రింగ్స్​.. ఇలా అన్నింట్లోనూ సాలిటైర్​ మోడల్స్​ ఉంటాయి. చూడ్డానికి చాలా సింపుల్​గా, ఎలిగెంట్​గా ఉండే ఇవి.. ముఖానికి స్పెషల్​ అట్రాక్షన్​ అవుతాయనడంలో అనుమానమే లేదు.ఇవి వెస్టర్న్​​ వేర్​తో పాటు  ట్రెడిషనల్ డ్రెస్​ల మీద​కి కూడా బాగుంటాయి. ముఖ్యంగా బంగారం, డైమండ్​ కాంబినేషన్స్​లో సాలిటైర్స్​ మోడల్​లో వస్తున్న వేలాడే చెవికమ్మలు డిఫరెంట్​ లుక్ ఇస్తాయి. రంగురంగుల డైమండ్స్​తో చేసిన చెవికమ్మలు ఫ్యాషనబుల్​గానూ ఉంటాయి. చీరల మీదకి కూడా ఇవి బెస్ట్​ ఆప్ష​న్​. 

జుంకా పేరు వినగానే అందరి మైండ్​లో ట్రెడిషనల్ అవుట్​ఫిట్​ మెదులుతుంది. కానీ, జుంకాలని ఇండో వెస్టర్న్​​ డ్రెస్​లకి కూడా మ్యాచ్​ చేయొచ్చు. ముఖ్యంగా బంగారం, సిల్వర్​తో తయారుచేసే రంగురంగుల రాళ్ల జుంకాలు సింప్లీ సూపర్​గా ఉంటాయి. ప్రింటెడ్​ కుర్తీలు, ప్యాంట్​లు, కలర్​ఫుల్​ సిల్క్​ డ్రెస్​లమీదకి  వీటిని పెట్టుకుంటే స్టైలిష్​ లుక్​ వస్తుంది. వేడుక, అది  జరిగే ప్లేస్​ని బట్టి పెట్టుకునే జువెలరీ ఎంచుకోవాలి. గ్రాండ్​ డ్రెస్​లు వేసుకుంటే లైట్ వెయిట్​ జువెలరీ బాగుంటుంది. డైలీ వేర్​ లేదా ఆఫీస్​ లుక్​లోనే పార్టీలకి వెళ్తున్నప్పుడు కూడా లైట్​ వెయిట్​ జువెలరీ బెస్ట్​ ఆప్షన్​. డెలికేట్​ నెక్లెస్​లు కూడా వర్సటెయిల్ లుక్​ ఇస్తాయి. పార్టీల్లో సెంటరాఫ్​ అట్రాక్షన్​ కావాలంటే స్టేట్​మెంట్​, మినిమల్​ జువెలరీని మిక్స్​ చేయొచ్చు. అలాగే స్ట్రాప్​లెస్​ డ్రెస్​ల మీదకి చోకర్స్​ బాగుంటాయి. ఆఫ్​ షోల్డర్స్​కి అసిమెట్రిక్​, హాల్టర్ నెక్​కి సన్నటి పెండెంట్స్​ సూట్​ అవుతాయి. 

పసుపు, తెలుపు, రోజ్​ కలర్​ జువెలరీ ఎలాంటి అవుట్​ఫిట్​ మీదకైనా నప్పుతుంది. అవుట్​ఫిట్​ గోల్డ్​, సిల్వర్​ కలర్​లో ఉంటే మాత్రం మ్యాచింగ్​ రంగు జువెలరీనే బాగుంటుంది.  డైమండ్​ జువెలరీ ఎలాంటి అవుట్​ఫిట్​ మీదకైనా సెట్​ అవుతుంది.జువెలరీతో ఫంకీ స్టయిల్స్​ క్రియేట్​ చేయాలనుకునేవాళ్లు.. మిక్స్ అండ్​ మ్యాచ్​ కాన్సెప్ట్​ ట్రై చేయొచ్చు. అంటే... డిఫరెంట్​ డిజైన్స్​ , రకరకాల మెటల్​ కలర్స్​ జువెలరీ వేసుకోవచ్చు. కానీ,ఈ ప్యాటర్న్​ని ఫాలో కావాలను కునేవాళ్లు  చిన్న చిన్న జువెలరీ పీస్​లనే ఎంచుకోవాలి. పొరలు పొరలుగా ఉండే లేయర్డ్​ జువెలరీ లేదా రకరకాల డిజైన్ల జువెలరీని కలిపి వేసుకున్నా బాగుంటుంది. 

చాలామంది పెండ్లి కూతుళ్లు తమ స్పెషల్​ డే కోసం గ్రాండ్​ పట్టు చీరలనే కొంటారు. కానీ, జువెలరీ విషయానికి వచ్చేసరికి అంతగా పట్టించుకోరు. ఈ పొరపాటు వల్లే చీరల ముందు జువెలరీ తేలిపోయినట్టు కనిపిస్తుంది. అలాకాకూడదంటే జువెలరీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి . గోల్డ్​ స్టేట్​మెంట్ నెక్లెస్​లు బ్రైడల్ లుక్​కి మరింత గ్రాండ్​నెస్​ ఇస్తాయి. పెద్ద షాండ్లియర్​ ఇయర్​ రింగ్స్​, పోల్కీ జువెలరీ కూడా పెండ్లి కూతుళ్లకి బాగుంటుంది. సిల్వర్​ జువెలరీ  పెండ్లి ముస్తాబుకి మంచి ఛాయిస్​.