ఫైనల్లో ఏ జట్టు గెలుస్తుంది..? గణాంకాలు ఏం జట్టుకు అనుకూలం

ఫైనల్లో ఏ జట్టు గెలుస్తుంది..? గణాంకాలు ఏం జట్టుకు అనుకూలం

టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మరి కొద్ది గంటల్లో మొదలవుతుంది. సెమీస్లో అద్భుతంగా ఆడిన ఇంగ్లాండ్, పాక్ జట్లు ఫైనల్ చేరాయి. ఈ రెండు జట్ల మధ్య మెల్బోర్న్లో ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ ఏ జట్టు గెలుస్తుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఇంగ్లాండ్, పాకిస్తాన్ బలాబలాలు ఏంటీ..గణాంకాలు ఏం చెబుతున్నాయి..? ఓ సారి చూద్దాం...


  
టీ20ల్లో ఏ జట్టుది పైచేయి..
పాకిస్తాన్, ఇంగ్లాండ్ ..రెండు జట్లు టీ20ల్లో బలమైన జట్లుగా పేరొందాయి. అన్ని విభాగాల్లో రెండు జట్లు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులను గమనిస్తే మాత్రం..ఇంగ్లాండ్దే పైచేయిగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రెండు జట్లు 28 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లాండ్ 18 మ్యాచుల్లో గెలిస్తే..పాక్ కేవలం 8 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. చివరగా జరిగిన మ్యాచ్లోనూ ఇంగ్లాండే విజయం సాధించింది. 

టీ20 వరల్డ్ కప్లో పరిస్థితి ఏంటీ..?
ఇక టీ20 వరల్డ్ కప్లోనూ ఇంగ్లాండ్దే పైచేయి. ఇప్పటి వరకు రెండు జట్లు కేవలం రెండు సార్లు మాత్రమే తలపడ్డాయి. 2009, 2010 వరల్డ్ కప్లలో జట్ల మధ్య మ్యాచులు జరిగాయి. ఈ రెండింటిలోనూ ఇంగ్లాండే గెలిచింది. ఈ సారి కూడా ఇంగ్లాండ్ గెలిస్తే..విజయంతో పాటు..వరల్డ్ కప్ ఇంగ్లాండ్ సొంతం అవుతుంది. 

స్వదేశంలో..పాకిస్తాన్లో..ఇంగ్లాండ్దే పైచేయి..
సొంత గడ్డపై పాక్ ఆడిన మ్యాచుల్లోనూ ఇంగ్లాండే గెలిచింది. ఇంగ్లాండ్లో రెండు జట్ల మధ్య  ఐదు మ్యాచులు జరిగితే ..ఇందులో ఇంగ్లండ్ మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. రెండింటిలో పాకిస్తాన్ను విజయం వరించింది.పాకిస్తాన్లోనూ జరిగిన మ్యాచుల్లో కూడా ఇంగ్లాండ్ విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ మొదలవకముందు పాక్లో పర్యటించిన ఇంగ్లాండ్..టీ20 సిరీస్ను  ఇంగ్లాండే గెలిచింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ మూడు మ్యాచుల్లో గెలిస్తే..పాక్ రెండింటిలో విజయం సాధించింది.