కరోనా ఎఫెక్ట్‌.. ఎకానమీ స్లో డౌన్:‌ రైతులకు లోన్లు కట్‌‌

కరోనా ఎఫెక్ట్‌.. ఎకానమీ స్లో డౌన్:‌ రైతులకు లోన్లు కట్‌‌

అగ్రికల్చర్‌‌ మొండిబకాయిలు పెరుగుతాయంటున్న బ్యాంకులు
తప్పక ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు పోతున్న రైతన్నలు
బ్యాంకులతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ వడ్డీకి అప్పులు
సంపాదనంతా వడ్డీకే పోతదని ఎక్స్‌పర్స్ట్ ఆందోళన

మహారాష్ట్రకు చెందిన రైతు ధ్యానేశ్వర్‌కు విత్తనాలు, ఎరువులు కొనడానికి గత నెలలో డబ్బులు అవసరమయ్యాయి. బ్యాంకుకెళ్లి లోన్‌ అడిగితే రిజెక్ట్‌ చేశారు. దీంతో బయట ఏటా 60 శాతం వడ్డీ కి రూ. లక్షన్నర తీసుకున్నాడు. మరో రైతు ప్రశాంత్‌ కథే కూడా బ్యాంకుకెళ్లి అగ్రికల్చర్‌ లోన్‌ అడిగితే కుదరదన్నారు. దీంతో బయట రూ.3 లక్షలను ఏడాదికి 60 శాతం వడ్డీకి తీసుకున్నాడు.

ముంబై: కరోనా వల్లఎకానమీ స్లోఅవడం, లోన్లు తీసుకున్న వాళ్లు కట్టకపోవడంతో బ్యాంకులు ఆచితూచి అప్పులిస్తున్నాయి. అగ్రికల్చర్‌కు సంబంధించి మొండి బకాయిలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులకు లోన్లు ఇవ్వలేమని చెప్పేస్తున్నా
యి. దీంతో ఇప్పటికే వర్షాలు బాగా పడుతుండటం, మరో మార్గం లేకపోవడంతో రైతన్నలంతా బయట ఎక్కువ వడ్డీ
కి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.

వ్యవసాయ రుణాల ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలు ఎక్కువై..

ఇండియా ఎకానమీ వాల్యూ రూ. రెండు కోట్ల కోట్లకు పైనే. ఇందులో వ్యవసాయ రంగం వాటా 15 శాతం. దేశంలోని సుమారు సగం మంది అగ్రికల్చర్‌ మీదే ఆధారపడి బతుకుతున్నారు. అయితే వ్యవసాయ రంగంలో లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండటంతో బ్యాంకర్లుఅప్పివ్వడానికి ఇష్టపడటం లేదు. ‘చాలా రాష్ట్రాలు రైతు రుణ మాఫీ ప్రకటించి చాలా ఏండ్లయ్యింది. కానీ ఇప్పటికీ
మాకు డబ్బు అందలేదు. కాబట్టిఅప్పు తీసుకున్న రైతుల అకౌంట్లుఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలవుతాయి. అది క్లియర్ చేసే వరకూ మేం లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇవ్వలేం’ అని తమ తమ కారణాలు బ్యాంకులు వివరిస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 10 రాష్ట్రాలు
రుణమాఫీ ప్రకటించాయి. కానీ ఇప్పటికి 30 నుంచి 35 శాతమే బ్యాంకులకు చెల్లించాయని ఓ సీనియర్‌ బ్యాంకర్‌ చెప్పారు. బంగారంను తనఖా పెడితే ఇవ్వడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయని, కానీ మళ్లీకొత్తగా రుణాలంటే కష్టమని క్రెడిట్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
రేటింగ్‌ ఏజెన్సీ లు చెబుతున్నాయి. రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌ఇండియా ప్రకారం ఈ ఏడాది మార్చి నుంచి జూన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మధ్య వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు 1.8 శాతం తగ్గాయి. అదే 2019 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం అంతకుముందు ఇచ్చిన ఏడాదితో
పోలిస్తే 6 శాత స్తే ం పెరిగాయి.

బ్యాంకులు అప్పివ్వక..

బ్యాం కులు అప్పి వ్వకపోడం, ఖరీఫ్‌ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైపోవడంతో మరో మార్గం లేక రైతులు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అప్పు తీసుకుంటున్నారు. అయితే గతేడాది వరకు ఏడాదికి సుమారు 24 నుంచి 36 శాతంవరకు వడ్డీతీసుకున్న ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెండర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ..ఇప్పుడు 48 నుంచి 60 శాతం అడుగుతున్నారు. బ్యాంకుల దగ్గర్నుంచి 4 నుంచి 10 శాతానికే లోన్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తీసుకోవాల్సిన రైతులు వేరే దారి లేక అంతకు 6 రెట్లు ఎక్కువ వడ్డీకి తీసుకుంటాయి. రైతులకు అప్పులివ్వడంపెంచండని ప్రభుత్వాలు చెబుతున్నా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఏలు పెరగడంతో బ్యాంకులు ముందుకు రావట్లేదు. ఇలా రైతులు ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గి పోగ్గియి అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంత అప్పు తీసుకొన్నా సరిగా వర్షాలు పడకపోతే భూమి అమ్మి అప్పు కట్టే పరిస్థితి ఉంటుందని రైతులు అంటున్నారు.

మళ్లీ సిటీలకు వలస కూలీలు

పాట్నా/భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: కరోనా భయంతో సొంతూర్ల‌కు పోయిన వలస కూలీలు మళ్లీ సిటీలకు వస్తున్నారు. వైరస్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ్యాప్తి ఎక్కువ
వుతున్నా పని లేక, పూట గడవక పట్నం బాట పడుతున్నారు. ఒడిశా, బీహార్‌ రాష్ట్రాల నుంచి మెగా సిటీలైన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ,
ఢిల్లీ, బెంగళూరు, కలకత్తాలకు రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్తున్నారు. కూలీల అవసరం ఎక్కువున్న వ్యాపారులు వాళ్ల‌కు టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులిచ్చి
మరీ రమ్మంటున్నా రు. ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టికెట్లు బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , బెంగళూరు వెళ్లే ఫ్లైట్లు ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా
ఉంటున్నాయని పాట్నాలోని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు.