మీ బతుకులు ఏంటో ప్రజలు తేల్చారు : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

మీ బతుకులు ఏంటో ప్రజలు తేల్చారు : కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి కామెంట్లు చేసినంత మాత్రాన నువ్వు పెద్దోడివైపోవు. నీ బతుకు, మీ నాన్న బతుకు ఏంటో ఇప్పటికే తెలంగాణ ప్రజలు తేల్చారు’’అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న పదేండ్లు రాష్ట్రాన్ని స్టువర్టుపురం దొంగల్లా దోచుకున్నారని, అవినీతి సొమ్ములో వాటా అడిగిన సొంత బిడ్డను పార్టీ నుంచి గెంటేసిన చరిత్ర మీదని గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

 సొంత ఇంటిని చక్కబెట్టుకోలేని కేటీఆర్.. సీఎం రేవంత్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ‘‘మీ చెల్లి కవిత అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. సీఎం రేవంత్​ రెడ్డిపై చిల్లర మాటలు మాట్లాడడం ఏంటి? నువ్వు ఎంత ఎగిరిపడ్డా.. నీ మూతి పళ్లే రాల్తాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం దొంగ డ్రామాలు ఆపాలి’’అని కేటీఆర్​పై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.