చేపల పెంపకంలో టెక్నాలజీని వినియోగించాలి : విప్ ఆది శ్రీనివాస్

చేపల పెంపకంలో టెక్నాలజీని వినియోగించాలి : విప్ ఆది శ్రీనివాస్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలోని రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. చేపల పెంపకంలో మత్స్యకారులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు.

జిల్లాలో మత్స్య సంపద వృద్ధిపై ఇటీవల మంత్రి శ్రీహరి కరీంనగర్ వచ్చినప్పుడు మాట్లాడానన్నారు. గతంలో మిడ్ మానేరులో చేపల పిల్లలను వదిలామన్నారు. మల్కపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా చేపల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ రామచంద్రం, డీఏవో అఫ్జల్ బేగం, జాతీయఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

వేములవాడ/వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వేములవాడ పట్టణంలోని మార్కండేయనగర్, తిప్పపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి సందర్భంగా  విప్ ఆది శ్రీనివాస్ సాయిబాబాను దర్శించుకున్నారు. వేములవాడ రూరల్​ మండలం హన్మాజిపేట సాయిబాబా ఆలయంలో వేడుకల్లో పూజలు చేశారు.