
నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన చిన్నారుల దగ్గు మందులపై డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీకి చెందిన రెండు దగ్గు మందులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని.. ఉజ్బెకిస్తాన్‌లోని చిన్నారులకు వాడొద్దని హెచ్చరించింది. ఇటీవల ఉజ్బెకిస్తాన్ లో మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గు మంది తాగి 18 మంది చిన్నారులు ప్రాణాలు కొల్పోయిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
మారియన్ తయారు చేసిన రెండు దగ్గు మందులు అంబ్రోనాల్, డాక్-1 మాక్స్ లలో ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం పరిమితికి మించి డై ఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నాయని తెలిపింది. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని .. భద్రతలకు సంబంధించి మారియన్ బయోటెక్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదని వెల్లడించింది. చిన్నారుల మరణం తర్వాత ఉజ్బెకిస్థాన్ లోని నేషనల్ క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీస్ నాణ్యత పరీక్ష చేపట్టిందని పేర్కొంది.