డబ్ల్యూహెచ్ఓ కు ఆ పవర్ లేదు

డబ్ల్యూహెచ్ఓ కు ఆ పవర్ లేదు
  • సలహాలు, సూచనలే తప్ప ఆదేశాలు ఇవ్వలేం
  • కరోనా గురించి జనవరి 30 నుంచే హెచ్చరిస్తున్నాం
  • చాలా కంట్రీస్ పట్టించుకోలేదన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ గెబ్రియాస‌స్

జెనీవా : కరోనా మహమ్మరి వ్యాప్తిని నివారించటంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్య్లూహెచ్ఓ) అలర్ట్ గా వ్యవహారించిందని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాస‌స్ తెలిపారు. జనవరి 30 నే గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని దేశాలను అప్రమత్తం చేశామన్నారు. టెస్ట్ లు, ట్రీట్ మెంట్, కరోనా పేషెంట్లను గుర్తించటం, ఐసోలేషన్ చేసేందుకు అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని కోరామని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో డబ్ల్యూహెచ్ఓ ఘోరంగా వైఫల్యం చెందిందంటూ చాలా దేశాలు ఆరోపిస్తుండటంతో టెడ్రోస్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తమ సలహాలు, సూచనలను చాలా దేశాలు పట్టించుకోలేదని చెప్పారు. మేము ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించటం తప్ప కచ్చితంగా తమ ఆదేశాలను పాటించాలని ఆ దేశాన్ని ఆదేశించలేమని ఆ పవర్స్ మాకు లేవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చెప్పారు. కరోనా పై ప్రపంచాన్ని అలర్ట్ చేసిన నాటికి చైనా బయట కేవలం 82 కేసులు మాత్రమే ఉన్నాయని…లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లో ఒక్క కేసులు లేదని…యూరోప్ లో 10 కేసులు మాత్రమే ఉన్నాయని ట్విట్టర్ల్ లో డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. తాము ఇచ్చిన సూచనలు సలహాలు పాటించి ఉంటే కరోనా కంట్రోల్ ఉండేదని ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని టెడ్రోస్ చెప్పారు. కరోనా చాలా కాలం పాటు ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలను గత వారమే డబ్లూహెచ్ఓ హెచ్చరించింది.
వ్యాక్సిన్లు లేకపోతే పిల్లలు చనిపోతారు
కరోనా కారణంగా 21 దేశాల్లో పిల్లల్లో పలు వ్యాధులకు  వ్యాక్సినేషన్  ఆగిపోయిందని టెడ్రాస్ చెప్పారు. ఆయా దేశాల్లో పలు వ్యాధులకు వ్యాక్సిన్ల కొరత ఉందని ట్రాన్స్ పోర్టేషన్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వ్యాక్సిన్ల కొరత ఇలాగే ఉంటే చాలా మంది పిల్లలు చనిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వరల్డ్ వైడ్ గా వ్యాక్సిన్ల కొరత లేకుండా అన్ని దేశాలు సహకరించాలని కోరారు.