రెడ్ స్టేట్స్ బ్లూ స్టేట్స్ లేవు.. అంతా యునైటెడ్ స్టేట్స్

రెడ్ స్టేట్స్  బ్లూ స్టేట్స్ లేవు.. అంతా యునైటెడ్ స్టేట్స్

రెడ్ స్టేట్స్.. బ్లూ స్టేట్స్.. అంటూ ఏవీ లేవని.. అంతా యునైటెడ్ స్టేట్స్  అని అన్నారు జో బిడెన్. అమెరికా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మొదటిసారిగా మాట్లాడిన జొ బిడెన్… ఇది అమెరికన్ల విజయమన్నారు. ఎన్నికల్లో ఓడిన ట్రంప్ తనకు శత్రువు కాదన్నారు. అమెరికా అభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తామన్నారు. అమెరికాలో వర్ణవివక్షల లేకుండా అభివృద్ధి చేసుకుందామన్నారు.  7.4 కోట్ల మంద అమెరికన్లు డ్రెమోక్రాటర్లకు ఓటేశారన్నారు.అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరు కలిసి ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు.

అమెరికన్ల అందరినీ ఒక్కటి చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. అమెరికా ప్రజలందరికీ ఆరోగ్యం లక్ష్యం సాధిస్తానని చెప్పారు. అమెరికా ముందు చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. అమెరికాకు కొత్త రోజులు రానున్నాయన్నారు. అమెరికా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అమెరికన్లు ఆశించిన పాలన అందిస్తామన్నారు.కరోనానియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నకైన కమలా హారిస్ కు అభినందనలు తెలిపారు. కమలా హారిస్ అద్భుతమైన నాయకురాలన్నారు బిడెన్.