ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?

ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?

ChatGPT సృష్టికర్త అయిన  ఓపెన్ ఏఐ భారత దేశంలో తన మొదటి ఉద్యోగిని నియమించుకుంది. ఏఐ నిబంధనలను రూపొందించే  ప్రజ్ఞా మిశ్రాను ప్రభుత్వ సంబంధాల నిర్వహించే చీఫ్ గా నియమించింది. భారత దేశంలో పబ్లిక్ పాలసీ, భాగస్వామ్య వ్యవహారాలను చూసేందుకు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సపోర్టు ఉన్న OpenAI ప్రగ్యా మిశ్రాను నియమించింది. 39 ఏళ్ల మిశ్రా గతంలో Truecaller AB, Meta Platform inc లో పనిచేశారు. 

ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ? 

2021లో ప్రజ్ఞామిశ్రా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నుంచి MBA  గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ చదివింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్  నుంచి నేగోషియేషన్ లో డిప్లమా పొందింది. 

2021 జూలై నుంచి ట్రూకాలర్ పబ్లిక్ ఆఫైర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రజ్ఞామిశ్రా కంపెనీ ఎజెండాను ముందు తీసుకెళ్లడానికి ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కీలక వాటాదారులు, పెట్టుబడిదారులు, మీడియా భాగస్వామ్యంతో సన్నిహితంగా పనిచేయాల్సి ఉంటుంది. 

ప్రగ్యా మిశ్రాను  OpenAI ప్రభుత్వ రిలేషన్స్ హెడ్ గా నియమించింది కంపెనీ. దీంతో ఆ కంపెనీకీ భారత్ లో నియమించిన తొలి ఏఐ ఉద్యోగిగా ప్రజ్ఞా మిశ్రా నిలిచారు. కంపెనీ ఇంకా ఆమె నియామకాన్ని అధికారికంగా ప్రకటించలేదు. భారత దేశంలో పబ్లిక్ పాలసీ వ్యవహరాలకు ప్రజ్ఞా మిశ్రా హెడ్ గా పనిచేస్తారు.