40మంది మహిళలకు ఒకడే భర్త.. ఎవరీ రూప్‌చంద్

40మంది మహిళలకు ఒకడే భర్త.. ఎవరీ రూప్‌చంద్

నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం  కులాలవారీ జనాభా లెక్కలను నిర్వహిస్తోంది. అయితే జనాభా లెక్కల సేకరణ సమయంలో ఒక విచిత్రమైన  సంఘటన చోటుచేసుకుంది.  కుల గణన చేసేందుకు అర్వాల్‌లోని మునిసిపల్ కార్పొరేషన్‌ కు వెళ్లిన రాజీవ్ రంజన్ రాకేష్ అనే ప్రభుత్వ అధికారి రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న కొంతమంది కుటంబాలను కలిశాడు. 

అందులో 40 మంది మహిళలు రూప్‌చంద్‌ను తమ భర్తగా పేర్కొన్నారు. కొంతమంది మహిళలు రూప్‌చంద్‌ను తమ తండ్రి, కొడుకుగా కూడా తెలిపారు. మహిళల ఆధార్ కార్డులపై  తమ భర్త- పేరు రూపచంద్ పేరు కూడా రాసి ఉంది. ఇంతకీ ఈ రూప్‌చంద్‌ ఎవరనే విషయాన్ని ఆరా తీస్తే  అశ్చర్యపోయే విషయం బయటపడింది.

రూప్‌చంద్ అంటే వ్యక్తి కాదని, రూపాయిని,  వారు డబ్బును  రూపచంద్ అని పిలుస్తారని తేలింది. ఇక్కడ నివసించే స్త్రీలు రూపాయిని తమ సర్వస్వంగా భావిస్తారు  కాబట్టి వారందరూ తమ భర్త పేరు రూపచంద్ పేరును వ్రాస్తారు. ఏళ్ల తరబడి ఇక్కడిప్రాంతంలో నివసించే మహిళలకు శాశ్వత చిరునామా అంటూ లేదు. 

పాటలు పాడుతూ..డ్యాన్సులు వేస్తూ జీవనం సాధించే వీళ్లు .. రూప్‌చంద్‌ను తమ బంధువుగా భావిస్తారు.  ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని అధికారులు తేల్చారు. ఇలాంటి కుటుంబాలు డజన్ల కొద్దీ ఈ ప్రాంతంలో ఇంకా చాలనే ఉన్నాయి.