లాక్ డౌన్….కరెెక్ట్ టైమ్ లో కరెక్ట్ డిసిషన్

లాక్ డౌన్….కరెెక్ట్ టైమ్ లో కరెక్ట్ డిసిషన్

జెనీవా : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగించటాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. సరైన సమయంలో తీసుకున్న ధృడమైన నిర్ణయం మంటూ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా రీజినల్ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ అభినందించారు. కరోనా ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను కూడా ఆమె మెచ్చుకున్నారు. ” ఆరు వారాల పాటు లాక్ డౌన్ కారణంగా ఫిజికల్ డిస్టెన్స్ అమలుకు ఇది ఉపయోగపడుతుంది. కరోనా సోకిన వారిని గుర్తించడం, వారు కాంటాక్ట్ అయిన వారిని పట్టుకోవటం, ఐసోలేషన్ చేయటం వంటి చేసినప్పుడే కరోనాను అరికట్టగలం. భారత్ తీసుకున్న చర్యలపై ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే మాట్లాడటం సరికాదు” అని అన్నారు. లాక్ డౌన్ ను ప్రజలంతా పాటించేలా చర్యలు తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆమె అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు అన్ని దేశాలు కఠినంగా వ్యవహారించాలని డబ్యూహెచ్ఓ కోరుతోంది. ఒకేసారి కాకుండా దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ప్రపంచ దేశాలకు సూచిస్తోంది.