వైరస్‌ గురించి ఇన్ఫర్మేషన్‌ చైనా చెప్పలేదట..

వైరస్‌ గురించి ఇన్ఫర్మేషన్‌ చైనా చెప్పలేదట..
  • చైనాలోని డబ్ల్యూహెచ్‌వో కార్యాలయం రిపోర్ట్‌ పంపింది
  • క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కరోనా మహమ్మారి గురించి చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యాలయం నుంచి హెచ్చరికలు వచ్చాయని, చైనా స్వయంగా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో గతంలో ఇచ్చిన క్రానాలజీలో డిసెంబర్‌‌ 31న వుహాన్‌లోని హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను గుర్తించామని మాత్రమే ఇచ్చారని చెప్పింది. ఏప్రిల్‌ 20న విలేకరులతో మాట్టాడిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రియేసన్‌ చైనా నుంచి నివేదిక వచ్చిందనన్నారు కానీ.. ఎవరు ఇచ్చారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. ఈ వారం పబ్లిష్‌ చేసిన క్రానాలజీలో దీనికి సంబధించి మరిన్ని డీటైల్స్‌ ఇచ్చారు. డిసెంబర్‌ 31న ‘వైరల్‌ న్యుమోనియా’ కాంటాక్ట్‌ కేసులు ఉన్నాయని వూహాన్‌ హెల్త్ కమిషన్‌ వెబ్‌సైట్‌, లోకల్‌ మీడియా ద్వారా తెలుసుకుని చైనాలోని తమ కార్యాలయం దానిపై ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. అదే రోజు డబ్ల్యూహెచ్‌వో ఎపిడమిక్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ కూడా యూఎస్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ ఎపిడమియోలాజికల్‌ సర్వేలైన్స్‌ నెట్‌వర్క్‌ ప్రోమెడ్‌ నుంచి కూడా న్యూస్‌ రిపోర్ట్‌ వచ్చిందని, హూహాన్‌లో తెలియని న్యూమోనియా ఏదో ప్రబలుతుందని దాంట్లో ఉంది. కాగా ఈ విషయంపై డబ్యూహెచ్‌వో చైనా అథారిటీలను జనవరి 1న ప్రశ్నించగా.. జనవరి 3న చైనా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చింది. ఒక దేశాన్ని ఇన్ఫర్మేషన్‌ కోసం కాంటాక్ట్‌ అయిన 24 – 48 గంటల్లో సమాధానం ఇవ్వాల్సి ఉందని, దానిపై చైనా వెంటనే స్పందించి సమాచారం ఇచ్చిందని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్‌‌ మైకెల్‌ రయాన్‌ మీడియా సమావేశంలో చెప్పారు. కరోనా గురించి ప్రపంచాన్ని అలెర్ట్‌ చేయడంతో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించగా.. ఆ ఆరోపణలను సంస్థ ఖండించింది.