కేంద్రంలో మళ్లీ బీజేపీనే.. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లంటే?

కేంద్రంలో  మళ్లీ బీజేపీనే..  ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే  ఎవరికి ఎన్ని సీట్లంటే?
  • కాంగ్రెస్​కు 52 నుంచి 72 సీట్లు 
  • తెలంగాణలో కాంగ్రెస్​కు 8-10 సీట్లు
  • బీజేపీ, బీఆర్ఎస్​కు చెరో 3 నుంచి 5 స్థానాలు
  • ఏపీలో వైఎస్సార్​సీపీకి 24 నుంచి 25 వచ్చే అవకాశం
  • టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీదే హవా కొనసాగుతుందని టైమ్స్ నౌ– ఈటీజీ రీసెర్చ్ తాజా సర్వేలో వెల్లడైంది. లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా.. బీజేపీకి 308 నుంచి 328 సీట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 52 నుంచి 72 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లో వైఎస్ఆర్ సీపీ, డీఎంకే, టీఎంసీ, బీజేడీ పార్టీలు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గణనీయంగా ఎంపీ సీట్లను గెలుచుకుంటాయని సర్వే తేల్చింది. 

ఏపీలో 25 లోక్ సభ సీట్లు ఉండగా, అధికార వైఎస్ఆర్ సీపీ ఏకంగా 24 నుంచి 25 సీట్లను గెలుచుకోవచ్చని, ప్రతిపక్ష టీడీపీ 0 నుంచి 1 స్థానానికే పరిమితం కావచ్చని పేర్కొంది. ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా, బీఆర్ఎస్, బీజేపీ చెరో 3 నుంచి 5 సీట్లు గెలుచుకోవచ్చని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 సీట్లను సాధించవచ్చని సర్వేలో అంచనా వేశారు. ఇతరులకు ఒక సీటు రావచ్చని పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో టీఎంసీ చెరో 20 నుంచి 24 సీట్లు, ఒడిశాలో బీజేడీ 13 నుంచి 15, ఆప్ 4 నుంచి 7, ఇతరులు 66 నుంచి 76 స్థానాలను గెలుచుకోవచ్చని సర్వే తెలిపింది.