IND vs AFG: భారత క్రికెట్ జట్టు 2026లో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. ఈరోజు (2026, జూన్ 6 నుంచి 10) నుంచి న్యూ చండీగఢ్‌లోని పీసీఏ (PCA) స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. కాసేపట్లో (ఉదయం 9:30 గంటలకు) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2018 జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ తన కెరీర్లో ఆడిన మొట్టమొదటి చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ తర్వాత.. మళ్లీ ఇరు జట్లు రెడ్-బాల్ క్రికెట్లో తలపడటం ఇదే తొలిసారి.
ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ తన జట్టులోకి హర్ష్ దూబే, మానవ్ సుతార్ లాంటి ఇద్దరు యువ ఆటగాళ్లను తెచ్చింది. అలాగే డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపిన దేవదత్ పడిక్కల్ కూడా నంబర్ 3 పొజిషన్ కోసం రేసులో ఉన్నాడు. మరోవైపు, రషీద్ ఖాన్ అందుబాటులో లేకపోవడంతో ఆఫ్ఘన్ జట్టును హష్మతుల్లా షాహిదీ నడిపించనున్నాడు.
మ్యాచ్ విన్నర్ ప్రిడిక్షన్:
టాస్ ప్రిడిక్షన్: ముల్లాన్‌పూర్‌లో ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు.. ఇక్కడ జరిగిన 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5 డ్రాగా ముగిశాయి. ఇక్కడ పేసర్లకు పిచ్ సహకరిస్తుంది, మ్యాచ్ గడిచేకొద్దీ స్పిన్నర్లు కూడా సీన్లోకి వస్తారు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.
మ్యాచ్ విన్నర్: ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు గతంతో పోలిస్తే అనుభవం వచ్చినప్పటికీ.. భారత్‌తో పోలిస్తే వారు ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉన్నారు. టీమిండియా సెకండ్ స్ట్రింగ్ జట్టు బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ కంటే బలంగా ఉంది. కాబట్టి ముల్లాన్‌పూర్ వేదికగా జరిగే ఈ తొలి టెస్టులో భారత్ చాలా ఈజీగా విజయం సాధిస్తుందని అంచనా. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అత్యధిక ఫోర్లు కొట్టే అవకాశం ఉంది.
