నేడు సౌతాఫ్రికాతో ఇండియా మూడో టీ20 

నేడు సౌతాఫ్రికాతో ఇండియా మూడో టీ20 
  • రాత్రి 7 నుంచి ‘స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌’లో..

విశాఖపట్నం: సౌతాఫ్రికాతో సిరీస్‌‌‌‌కు ముందు ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగిన టీమిండియా ఇప్పుడు చావోరేవో పరిస్థితిలో నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడిన పంత్‌‌‌‌సేన.. మంగళవారం ప్రొటీస్‌‌‌‌తో జరిగే మూడో టీ20లోనైనా కచ్చితంగా గెలిచి సిరీస్​లో నిలవాలని చూస్తోంది. ఇక ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–0 లీడ్‌‌‌‌లో ఉన్న సఫారీ టీమ్‌‌‌‌ ఇందులోనూ గెలిచి సిరీస్‌‌‌‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమిండియా ఒకటి, రెండు మార్పులు చేసే చాన్స్‌‌‌‌ కనిపిస్తోంది.

ఇషాన్‌‌‌‌ ఫర్వాలేదనిపించినా..

ఓపెనర్లలో ఇషాన్‌‌‌‌ ఫర్వాలేదనిపించినా రుతురాజ్‌‌‌‌ ఫెయిలయ్యాడు.  అతని స్థానంలో  వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడాలో ఒకరిని తీసుకోవచ్చు. భారీ ఆశలు పెట్టుకున్న పాండ్యా బౌలింగ్‌‌‌‌లోనూ నిరాశపరుస్తుండటం పెద్ద ప్రతికూలంగా మారింది.  వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు టైమ్‌‌‌‌ తక్కువగా ఉండటంతో పంత్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌పై కూడా అందరూ దృష్టిసారించారు. ఇక స్పిన్‌‌‌‌లో చహల్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ ఇద్దరిలో ఒకర్ని తప్పించి రవి బిష్ణోయ్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వొచ్చు. పేసర్లలో భువనేశ్వర్‌‌‌‌, హర్షల్‌‌‌‌, ఆవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ను కొనసాగించొచ్చు. ఒకవేళ మార్పు కావాలనుకుంటే ఉమ్రాన్‌‌‌‌, అర్షదీప్‌‌‌‌లో ఒకరు నేషనల్​ టీమ్​లోకి వస్తారు. మరోవైపు ఈ మ్యాచ్‌‌‌‌తోనే సిరీస్‌‌‌‌ను పట్టేయాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్న సౌతాఫ్రికా రెండో మ్యాచ్​ తుది జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు