పీఎం కిసాన్ డబ్బులు పడని 40 లక్షల మంది రైతులు.. ఇలా చేయండి

పీఎం కిసాన్ డబ్బులు పడని 40 లక్షల మంది రైతులు.. ఇలా చేయండి

రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం ప్రభుత్వంఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం  కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2019లో ఈ పథకాన్ని  అమల్లోకి తీసుకురాగా ఇంతవరకు 16 విడతలుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమచేశారు.  ఈ పథకం కింద ఏడాదికి రూ. 6 వేలు అంటే ప్రతి 4 నెలలకు ఓసారి మొత్తం 3 విడతలకు రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.  

2024 ఫిబ్రవరి 28న ఈ పీఎం కిసాన్ 16వ విడత నిధుల్ని  ప్రధాని మోదీ విడుదల చేశారు.   మొత్తం 8 కోట్లకుపైగా లబ్ధిదారులకు.. రూ. 18 వేల కోట్ల మొత్తం విడుదల చేశారు.  చిన్నచిన్న తప్పిదాల వల్ల 40 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ డబ్బులను పొందలేకపోయారు.  పీఎం కిసాన్ యోజన డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఈ- కేవైసీ.  ఇది పూర్తి చేసిన వారికే పీఎం కిసాన్ అమౌంట్ ఖాతాలో పడుతుంది. ఆన్ లైన్ విధానంలో మీ ఈ- కెవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయాలి. ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు పడవు.  

Also read : ప్రధాని మోడీని కలిసిన పద్మ విభూషణ్ వైజయంతి మాల..!

పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు https://pmkisan.gov.in/ పోర్టల్‌లో బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.  ఇక ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 155261, 011-24300606 హెల్ప్‌లైన్స్‌ను సంప్రదించొచ్చు.

పీఎమ్ కిసాన్ డబ్బు రాకపోవడానికి కారణాలు

  • లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండటం
  • కేవైసీ పూర్తి కాకాపోవడం 
  • అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు IFSC కోడ్ తప్పుగా రాయడం
  • తప్పు అకౌంట్ నంబర్స్ ఇవ్వడం
  • బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం
  • ఫీల్డ్ వాల్యూ మిస్సింగ్
  • వాలీడ్ కానీ బ్యాంక్, ఫాస్ట్ ఆఫీస్ పేరు
  • బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ నెంబర్ రెండూ సరైనవి కానప్పుడు